SPaceX: స్పేస్‌ఎక్స్‌ ప్రయోగించిన అతిపెద్ద రాకెట్‌ ప్రయోగం రెండోసారి విఫలం..

స్పేస్‌ఎక్స్‌ కంపెనీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్టార్‌షిప్‌ అనే భారీ రాకెట్‌ ప్రయోగం రెండోసారి విఫలమైంది. టెస్ట్‌ఫ్లైట్‌లో భాగంగా 2.48 తర్వాత బూస్టర్ విడిపోయి ఆ తర్వాత పేలిపోయింది. అలాగే స్పేస్‌క్రాఫ్ట్ ముందుకు వెళ్లిన కొన్ని నిమిషాలకే కమ్యూనికేషన్ తెగిపోయింది.

New Update
SPaceX: స్పేస్‌ఎక్స్‌ ప్రయోగించిన అతిపెద్ద రాకెట్‌ ప్రయోగం రెండోసారి విఫలం..

ప్రముఖ ప్రైవేటు కంపెనీ అయిన స్పేస్‌ఎక్స్‌ మరోసారి ప్రతిష్ఠాత్మకంగా.. స్టార్‌షిప్‌ అనే భారీ రాకెట్ ప్రయోగాన్ని చేపట్టింది. కానీ రెండోసారి కూడా ఈ ప్రయోగం విఫలం అయ్యింది. స్థానిక కాలమాణ ప్రకారం చూసుకుంటే.. శనివారం ఉదయం దక్షిణ టెక్సాస్‌ తీరం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టగా.. విజయవంతగా ఈ స్టార్‌షిప్ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. రెండు దశలు (బూస్టర్‌, స్పేస్‌క్రాఫ్ట్‌)గా ఉన్న ఈ రాకెట్‌.. టెస్ట్‌ఫ్లైట్‌లో భాగంగా 2.48 నిమిషాల తర్వాత బుస్టర్ విడిపోయింది. కానీ ఆ తర్వాత వెంటనే అది పేలిపోయింది. స్పేస్‌క్రాఫ్ట్‌ ముందుకు వెళ్లిన కొన్ని నిమిషాలకే కమ్యూనికేషన్‌ కూడా తెగిపోయింది. దీనివల్ల రాకేట్ దారితప్పకుండా ఉండేందుకు దాన్ని పేల్చేసినట్లు తెలుస్తోంది.

Also read: ఓటుకు రూ. 10 వేలు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

మనం నేర్చుకునే దాని నుంచే విజయం వస్తుందని.. ఈరోజు జరిగిన ప్రయోగం.. స్టార్‌షిప్‌ విశ్వసనీయతను మెరుగుపరచడంలో సహాయపడుతుందని స్పేస్‌ఎక్స్‌ ట్వీట్‌ చేసింది. మరోవైపు స్పెస్‌ఎక్స్‌ సీఈఓ ఎలాన్‌ మస్క్‌.. స్పేస్‌ఎక్స్‌ బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా స్టార్‌షిప్‌ మొదటి టెస్ట్‌ఫ్లైట్‌ ప్రయోగించగా అది విఫలమైంది. ఆ రాకెట్ గాల్లోకి ఎగిరిన 4 నిమిషాలకే గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోలో కుప్పకూలింది. దీంతో తొలి ప్రయోగంలోని జరిగిన లోపాలు, వైఫల్యాలను విశ్లేషించి.. రాకెట్‌, ల్యాంచ్‌ ప్యాండ్‌లను స్పేస్‌ఎక్స్‌ మరింత మెరుగ్గా అభివృద్ధి చేసింది. అమెరికా గగనతల నిర్వహణ సంస్థ (FAA) సూచించినటువంటి 57 మార్పులూ చేసింది. అయితే FAA పర్మిషన్ ఇచ్చిన తర్వాత తాజాగా శనివారం రెండోసారి పరీక్షించినా కూడా అది విఫలమైపోయింది స్టార్‌షిప్‌ రాకెట్‌ పొడవు ఏకంగా 121 మీటర్లు(400 అడుగులు). ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్‌గా పేరున్న దీన్ని.. చందమామ, అంగారకుడిపై యాత్రలకు వీలుగా స్పేస్‌ఎక్స్‌ తయారుచేసింది.

Also read: చాట్‌జీపీటీ సృష్టికర్తపై వేటు.. కంపెనీ సీఈఓగా తొలగింపు.. కారణం ఇదే..

Advertisment
Advertisment
తాజా కథనాలు