Akhilesh Yadav: ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ సమన్లు.. కారణం ఇదే సమాజ్‌వాద్ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు బుధవారం సీబీఐ సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్‌కు సంబంధించిన కేసు విచారణలో భాగంగా ఆయన్ని సాక్షిగా పిలిచింది. 2012 నుంచి 2016 మధ్యకాలంలో నిబంధనలు ఉల్లంఘించి అధికారులు గనులు కేటాయించారనే ఆరోపణలు రావడంతో ఆయన్ని విచారించనుంది. By B Aravind 28 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి సమాజ్‌వాద్ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌కు బుధవారం సీబీఐ సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్‌కు సంబంధించిన కేసు విచారణలో భాగంగా ఆయన్ని సాక్షిగా పిలిచింది. దీంతో రేపు అఖిలేషన్‌ను అధికారులు ప్రశ్నించనున్నట్లు.. దర్యాప్తు సంస్థ వర్గాలు తెలిపాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లో అక్రమ మైనింగ్‌కు సంబంధించి ఏడు జిల్లాల్లో పోలీసులు కేసు నమోదు చేశారు. 2012 నుంచి 2016 మధ్యకాలంలో రూల్స్ ఉల్లంఘించి అధికారులు గనులు కేటాయించారనే ఆరోపణలు ఉన్నాయి. Also Read: నేను రాజీనామా చేయలేదు.. క్లారిటీ ఇచ్చిన సుఖ్విందర్ సింగ్ 2012-2017 వరకు సీఎంగా అఖిలేష్ ఈ క్రమంలోనే సీబీఐ ఈ వ్యవహారానికి సంబంధించి విచారణ జరుపుతోంది. 2012 నుంచి 2017 వరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ విధులు నిర్వహించారు. అంతేకాదు 2012-13 మధ్యకాలంలో మైనింగ్ మత్రింత్వ శాఖ బాధ్యతలను కూడా పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలోనే ఆయనను ఫిబ్రవరి 29న సాక్షిగా హాజరుకావాలంటూ సీబీఐ సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్‌కు మద్ధతిచ్చిన ఎస్పీ ఇదిలాఉండగా.. లోక్‌సభ ఎన్నికలు దగ్గరికొస్తున్న నేపథ్యంలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ ఎక్కువ సీట్లు సాధించేలా గట్టి ప్రయత్నాలను మొదలుపెట్టారు. అంతేకాదు.. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో న్యాయ యాత్రలో కూడా పాల్గొన్నారు. యూపీలో ఆగ్రాకు యాత్ర చేరుకున్నప్పుడు అఖిలేష్ మద్దతు ప్రకటించారు. ఇప్పటికే కాంగ్రెస్, ఎస్పీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఒప్పందం కూడా జరిగింది. సమాజ్‌వాద్ పార్టీ, ఇండియా కూటమి, ఇతర పార్టీలు కలిసి 63 స్థానాల్లో పోటీ చేయనుండగా.. కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేయనుంది. Also Read: ఎన్నికల తర్వాత దేశంలో UCC అమలు.. అమిత్‌షా సంచలన వ్యాఖ్యలు! #telugu-news #cbi #national-news #akhilesh-yadav #samajwadhi-party మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి