Child : పిల్లల్ని కంటే రూ.61 లక్షల ప్రోత్సాహకం

సౌత్ కొరియాలో ప్రస్తుతం జనాభా సంక్షోభాన్ని ఎదుర్కోవడంతో అక్కడి ప్రభుత్వం వినూత్న చర్యలకు సిద్ధమైంది. పిల్లలకు జన్మనిచ్చే తల్లితండ్రులకు ప్రోత్సాహకంగా.. ఒక్కో బిడ్డకు 59 వేల పౌండ్లు మన కరెన్సీలో దాదాపు రూ.61 లక్షలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

New Update
Child : పిల్లల్ని కంటే రూ.61 లక్షల ప్రోత్సాహకం

Child Born : సౌత్ కొరియా ప్రస్తుతం జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో ఆ దేశంలో జనన రేటును పెంచేందుకు అక్కడి ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. పిల్లలకు జన్మనిచ్చే తల్లితండ్రులకు(Parents) ప్రోత్సాహకంగా.. ఒక్కో బిడ్డకు 59 వేల పౌండ్లు మన కరెన్సీలో దాదాపు రూ.61 లక్షలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమాన్ని త్వరలో అమలు చేసేందుకు ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రభుత్వానికి చెందిన అవినీతి నిరోధక, పౌర హక్కుల కమిషన్‌ ఓ సర్వేను కూడా చేపట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Also Read: సరిహద్దులు దాటిన మానవత్వం… పాక్‌ యువతికి భారతీయుని గుండె!

ఈ పబ్లిక్ సర్వే(Public Survey) ఏప్రిల్ 17న ప్రారంభం అయ్యింది. పిల్లల్ని కనేవారి కోసం ప్రోత్సాహాకాలు ఇచ్చేందుకు ప్రతిఏడాది 12.9 బిలియన్ పౌండ్లు ( దాదాపు రూ.1.3 లక్షల కోట్లు) ఖర్చు చేసేందుకు సౌత్ కోరియా(South Korea) రెడీ అయిపోయింది. ఇది ఆ దేశ బడ్జెట్‌లో దాదాపు సగభాగం కావడం గమనార్హం. ఇదిలాఉండగా.. దక్షిణ కొరియాలో 2023లో జననాల రేటు 0.72కు పడిపోయింది. 2023లో రికార్డైన దాతీయ జనన రేటు ఆ దేశ చరిత్రలో అత్యంత కనిష్ఠంగా నమోదవ్వడం ఇదే మొదటిసారి. అక్కడ జనాభా సంక్షోభానికి అనేక కారణాలున్నాయి. జీవన వ్యయం పెరిగిపోడం, జీవన నాణ్యత తగ్గడంతో.. అక్కడి ప్రజలు పిల్లల్ని కనేందుకు ఆసక్తి చూపడం లేదు.

Also Read: మానవ ఎముకల నుంచి జాంబీ డ్రగ్ .. శ్మశానాల్లో యముకలు మాయం చేస్తున్న దుండగులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు