Trains Cancelled: రెయిన్ ఎఫెక్ట్.. మరో 49 రైళ్లు రద్దు.. లిస్ట్ ఇదే!

తెలుగు రాష్ట్రాల్లో వరదలు పోటెత్తిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరోసారి పెద్ద ఎత్తున రైళ్లను రద్దు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు నడిచే రైళ్లను రద్దు చేసింది. ఇందులో సోమవారం, మంగళవారం అలాగే బుధవారం నడిచే రైళ్లు కూడా ఉన్నాయి.

New Update
Trains Cancelled: రెయిన్ ఎఫెక్ట్.. మరో 49 రైళ్లు రద్దు.. లిస్ట్ ఇదే!

తెలుగు రాష్ట్రాల్లో వరదలు పోటెత్తాయి. రోడ్లు, బ్రిడ్జిలు కట్టుకుపోతున్నాయి. పలుచోట్ల రైల్వే ట్రాక్‌లు కూడా దెబ్బతిన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో నీటమునిగాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరోసారి పెద్ద ఎత్తున రైళ్లను రద్దు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు నడిచే రైళ్లను రద్దు చేసింది. ఇందులో సోమవారం, మంగళవారం అలాగే బుధవారం నడిచే రైళ్లు కూడా ఉన్నాయి.

Also Read: ఈ జాగ్రత్తలు పాటిస్తే మీరు సేఫ్.. తెలంగాణ పోలీసుల కీలక ప్రకటన!

రద్దైన రైళ్లు ఇవే
సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ (17233)
సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-సికింద్రాబాద్‌ (17234)
విశాఖపట్నం – సికింద్రాబాద్‌ (12783)
విశాఖపట్నం-సికింద్రాబాద్‌ (22203)
సికింద్రాబాద్‌-షాలిమార్‌ (12774)
షాలిమార్‌ – సికింద్రాబాద్‌ (12773)
సికింద్రాబాద్‌-విశాఖపట్నం (22204)
బెంగళూరు – హౌరా (12864)
కడప-విశాఖపట్నం (17487)
ఆదిలాబాద్‌-నాందేడ్‌ (17409)
నాందేడ్‌-ఆదిలాబాద్‌ (17410)
విశాఖపట్నం – సికింద్రాబాద్‌ (12805)
భువనేశ్వర్‌ – బెంగళూరు (18463)
విశాఖపట్నం-గుంటూరు (22701)
సికింద్రాబాద్‌-విశాఖపట్నం (20707)
విశాఖపట్నం – సికింద్రాబాద్‌ (20833)
సికింద్రాబాద్‌-విశాఖపట్నం (20834)

వీటితో పాటు మచిలీపట్నం – తిరుపతి, నర్సాపూర్‌-నగర్‌సోల్‌, బెంగళూరు-దానాపూర్‌, తిరుపతి-కాకినాడ రైలుతో పాటు మరికొన్ని రైళ్లను కూడా దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. అలాగే, మరో 13 రైళ్లు వేరే దారికి మళ్లించినట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించి.. సహకరించాలని కోరింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో రాబోయే 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు.

New Update
Rains

Rains

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో రాబోయే రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు వర్ష సూచన ఉంది. అటు ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment