T20 World Cup: సూపర్ 8లో మొదటి విజయం..అమెరికా మీద గెలిచిన సౌత్ ఆఫ్రికా

టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్ 8 పోరు మొదలయిపోయింది. మొదటి మ్యాచ్‌ సౌత్ ఆఫ్రికా, అమెరికాల మధ్య జరిగింది. ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా గెలిచింది. కానీ అమెరికా కూడా ఎక్కడా తగ్గకుండా ఆడింది. తమను ఓడించడం అంత ఈజీ కాదని హెచ్చరించింది.

New Update
T20 World Cup: సూపర్ 8లో మొదటి విజయం..అమెరికా మీద గెలిచిన సౌత్ ఆఫ్రికా

America Vs Soth Africa: టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8 పోరులో భాగంగా అమెరికా మీద దక్షిణాఫ్రికా 18 పరుగుల తేడాతో నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 194 పరుగుల చేసింది. జట్టు ఓపెనర్‌ డికాక్‌ 40 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 74 పరుగులు చేయగా.. కెప్టెన్‌ మార్‌క్రమ్‌ 32 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 46 పరుగులు, క్లాసెన్‌ 22 బంతుల్లో 3 సెక్స్‌లు కొట్టి 36 పరుగులు, స్టబ్స్‌ 16 బంతుల్లో 2 ఫోర్లతో 26 పరుగులు చేశారు. అమెరికా బౌలర్లలో నేత్రావల్కర్‌, హర్మీత్‌ సింగ్‌ రెండు వికెట్లు పడగొట్టారు.

తర్వాత 195 పరుగుల తేడాతో అమెరికా బ్యాటింగ్‌కు దిగింది. 2౦ ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఒకానొక దశలో అమెరికా టీమ్ కచ్చితంగా మ్యాచ్ గెలుస్తుందనే అనుకున్నారు అందరూ. జట్టులో ఓపెనర్‌ ఆండ్రిస్‌ గౌస్‌ (80*: 47 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగినప్పటికీ చివరలో తడబడడంతో ఆజట్టు ఓటమిపాలైంది. హర్మీత్‌ సింగ్‌ (38), స్టీవెన్‌ టైలర్‌ (24) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ మూడు వికెట్లు తీయగా, కేశవ్‌ మహరాజ్‌, అన్‌రిచ్‌, తబ్రేజ్‌ షంసీ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దు ..

ఇదీ అమెరికా చెప్తోంది. సౌత్ ఆఫ్రికా భారీ లక్ష్యం ఇచ్చింది. ఆ టీమ్ బౌలర్లు కూడా ఏమీ తక్కువ కాదు. అయినా కూడా అమెరికా జట్టు ఏ మాత్రం భయపడలేదు. ఎక్కడా తడబడలేదు. ఓపెనర్ ఆండ్రిస్ సౌత్ ఆఫ్రికా బౌలర్ల మీద విరుచుకుపడ్డాడు. వికెట్లు పడుతున్నా తాను మాత్రం గ్రౌండ్‌కే స్టిక్ అయిపోయాయడు. మిగతా బ్యాటర్లు కూడా బాగానే ఆడారు. మరికాస్త నిలకడగా ఆడి ఉంటే మ్యాచ్ తప్పకుండా గెలిచే వారు. 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 73 పరుగులతో నిలిచిన ఆజట్టు.. ఆతర్వాత మెల్లిగా తమ బ్యాటకు పదును పెట్టారు. నోకియా వేసిన 15వ ఓవర్లో అయితే గౌస్‌ విశ్వరూపం చూపించాడు. ఒక ఫోర్‌, రెండు సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. ఇక ఆ జట్టుకు చివరి 4 ఓవర్లలో 60 పరుగులు అవసరం కాగా, తొలి రెండు ఓవర్లలో 32 పరుగులు చేశారు.

Also Read:Andhra Pradesh: ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Bharat Bhushan: మూడేళ్ల చిన్నారి ఉందన్న వదల్లేదు.. మూడు నిమిషాలు పాటు కాల్చి కాల్చి!

ఉగ్రదాడిలో 35 ఏళ్ల భరత్ భూషణ్ తన ప్రాణాలు కోల్పోయాడు. తనకు మూడేళ్ల చిన్నారి ఉన్నందున విడిచిపెట్టాలని భరత్‌ భూషణ్‌ వారిని కోరినా పట్టించుకోకుండా తన భర్తను మూడు నిమిషాల పాటు అతి దారుణంగా  కాల్చేశాడని భరత్ భార్య సుజాత వాపోయింది.  

New Update
 Bharat Bhushan

Bharat Bhushan

పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బాధితులు కాళ్లు పట్టుకుని, చేతులెత్తి దండం పెట్టిన వదల్లేదు. ఈ ఉగ్రదాడిలో 35 ఏళ్ల భరత్ భూషణ్ తన ప్రాణాలు  కోల్పోయాడు. అందరినీ కాల్చేస్తూ ఓ ఉగ్రవాది తమ వద్దకు రాగా.. తనకు మూడేళ్ల చిన్నారి ఉన్నందున విడిచిపెట్టాలని భరత్‌ భూషణ్‌ వారిని కోరినా పట్టించుకోకుండా తన భర్తను మూడు నిమిషాల పాటు అతి దారుణంగా  కాల్చేశాడని భరత్ భార్య సుజాత వాపోయింది.  

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

దయచేసి నన్ను వదిలేయండి

భరత్ భూషణ్ భార్య సుజాత భూషణ్ ప్రముఖ డాక్టర్. ఈ దంపతులకు మూడేళ్ల చిన్నారి ఉంది. బెంగళూరులో స్థిరపడిన వీరంతా 2025 ఏప్రిల్ 18న విహారయాత్ర కోసమని కశ్మీర్ వెళ్లారు. ఏప్రిల్ 23న బెంగళూరుకు తిరిగి వెళ్లాల్సి ఉండగా.. మంగళవారం మధ్యాహ్నం పహల్గాం సమీప ప్రాంతానికి వెళ్లి అక్కడ సరదాగా తమ చిన్నారితో గడిపారు.  అప్పుడు అకస్మాత్తుగా  కాల్పలు శబ్ధాలు రావడంతో వెంటనే  ముగ్గురం పక్కనే ఉన్న గుడారాల వెనుక దాక్కున్నారు. ఇది గమనించిన ఓ ఉగ్రవాది తమ దగ్గరికి వచ్చాడని సుజాత తెలిపారు. తన  భర్త ఆ ఉగ్రవాదిని ‘‘నాకు ఒక బిడ్డ ఉంది. దయచేసి నన్ను వదిలేయండి’ అని అడిగాడు. అయినప్పటికీ ఆ ఉగ్రవాది కనికరించలేదు. తన భర్త తలపై కాల్చి చంపి వెళ్లిపోయాడంటూ సుజాత కన్నీటి పర్యాంతమైంది.  

Also Read : ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఉండవు : బీసీసీఐ

పహల్గామ్ దాడి జమ్మూ కాశ్మీర్‌లో ఆరు సంవత్సరాలలో జరిగిన అత్యంత దారుణమైనది, 2019 ఫిబ్రవరిలో పుల్వామా జిల్లాలో 40 మంది సైనికులు హత్యకు గురైన తర్వాత ఇదే అత్యంత దారుణమైనది. అమాయకపు టూరిస్టులపై దాడులకు పాల్పడిన ఏ ఒక్క డగ్రవాదిని కూడా వదిలిపెట్టబోమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

Advertisment
Advertisment
Advertisment