Telangana: హైదరబాద్‌లో మళ్లీ డ్రగ్స్‌.. నడిరోడ్డుపై పట్టుకున్న పోలీసులు

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. అక్రమంగా హెరాయిన్‌ను రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను SOT పోలీసులు నడిరోడ్డుపై పట్టుకున్నారు. నిందితుల నుంచి 34 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

New Update
Telangana: హైదరబాద్‌లో మళ్లీ డ్రగ్స్‌.. నడిరోడ్డుపై పట్టుకున్న పోలీసులు

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. అక్రమంగా హెరాయిన్‌ను రవాణా చేస్తున్న నిందితులను SOT పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 34 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. నిందితులు రమేష్ కుమార్ మరియు మహదేవ్ తోబుట్టువులు. 2022లో జీవనోపాధి కోసం హైదరాబాద్‌ వచ్చారు. అయితే వాళ్లుండే గదిలో రూమ్‌మేట్ విక్రమ్ గోయెల్‌తో కలిసి ఇద్దరూ హెరాయిన్‌కు బానిసలయ్యారు. అక్రమంగా డబ్బులు సంపాదించేందుకు రాజస్థాన్‌లో తక్కువ ధరకు హెరాయిన్‌ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.

Also Read: క్లాస్ రూమ్‌లో కూలిన గోడ.. ఫస్ట్ ఫ్లోర్ నుండి కింద పడ్డ విద్యార్థులు..

గత ఏడాది నుంచి దినేష్ కళ్యాణ్ అనే వ్యక్తి నుంచి వీళ్లు హెరాయిన్ కొనుగోలు చేస్తున్నారు. రాజస్థాన్‌లో ఒక గ్రాము హెరాయిన్‌ రూ.6 వేలు ఉండగా.. హైదరాబాద్‌లో ఒక గ్రాముకు రూ.12000 విక్రయిస్తున్నారు. ఇటీవలే రాజస్థాన్‌ వెళ్లి హైదరాబాద్‌కు తీసుకొచ్చిన దినేష్ కళ్యాణ్‌ నుంచి 30 గ్రాముల హెరాయిన్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం SOT ఎల్బీనగర్ బృందం సరూర్‌నగర్‌ పోలీసులతో కలిసి నిందితులను పట్టుకున్నారు. వారినుంచి 34 గ్రాముల హెరాయిన్‌, ఒక బైకు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వారిని విచారణ చేస్తున్నారు.

Also Read: మస్తున్నావ్‌..నేను చెప్పిన ప్లేస్‌ కి రావాలి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Jammu & Kashmir : జమ్మూకాశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. టూరిస్టులపై కాల్పులు !

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు పర్యాటకుల బృందంపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు పర్యాటకులు గాయపడ్డారు.  వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అమర్‌నాథ్ యాత్రకు కొద్దిసేపటి ముందు ఈ దాడి జరగడం కలకలం రేపింది.  

New Update
J-K's Pahalgam

J-K's Pahalgam

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు.  బైసరన్ లోయలో పర్యాటకుల బృందాన్ని  లక్ష్యంగా చేసుకుని  కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పది మందికి బుల్లెట్ గాయాలు కాగా ఇందులో  ఆరుగురు పర్యాటకుల పరిస్థితి విషమంగా ఉంది. వారిలో ముగ్గురు స్థానికులు, ముగ్గురు స్థానికేతరులు ఉన్నారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఉగ్రవాదులను వేటాడేందుకు భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.

విచక్షణారహితంగా కాల్పులు

పహల్గామ్‌లో ట్రెక్కింగ్ కోసం వచ్చిన పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిగాయి. అమర్‌నాథ్ యాత్రకు కొద్దిసేపటి ముందు ఈ దాడి జరగడం కలకలం రేపింది. అమర్‌నాథ్ యాత్ర భద్రత గురించి ప్రశ్నలు తలెత్తాయి. కాగా జమ్మూకాశ్మీర్‌లో పహల్గామ్ టూరిస్ట్ ప్రాంతాలలో ఒకటి, ఇక్కడికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు.  ఈ ప్రాంతానికి కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకోవచ్చు.

Also read : ఫోన్ తీసుకుందని.. టీచర్‌ను చెప్పుతో కొట్టి, ల*జే అంటూ దాడిచేసిన విద్యార్థిని: (వీడియో)

Also Read: గూగుల్‌ లో వెతికి మరి చంపేసింది.. మాజీ డీజీపీ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు!

Advertisment
Advertisment
Advertisment