COVID-19 : మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. వారం రోజుల్లో 26 వేల కేసులు

సింగపూర్‌లో ప్రస్తుతం కరోనా కొత్త వేవ్‌ కలకలం రేపుతోంది. వారం రోజుల్లోనే దాదాపు 26 వేల కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కేపీ.2 వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ మంత్రి కుంగ్ సూచించారు.

New Update
COVID-19 : మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. వారం రోజుల్లో 26 వేల కేసులు

Singapore Braces For Covid-19 : 2019 డిసెంబర్‌లో చైనా (China) లో బయటపడ్డ కరోనా వైరస్ (Corona Virus) ప్రపంచ దేశాలను ఎలా అతలాకుతలం చేసిందో అందరికీ తెలిసిందే. ప్రతిరోజూ కొవిడ్‌ కేసులు (Covid Cases) నమోదవుతున్నప్పటికీ దీని ప్రభావం చాలావరకు తగ్గిపోయింది. కానీ ఈ మహమ్మారి మాత్రం కొత్త రకం రూపాలను మార్చుకుంటూ ప్రపంచ దేశాలను మళ్లీ మళ్లీ ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం సింగపూర్‌లో కరోనా కొత్త వేవ్‌ కలకలం రేపుతోంది. వారం రోజుల్లోనే దాదాపు 26 వేల కేసులు నమోదయ్యాయి.

Also Read: మోదీని మళ్ళీ ప్రధానిని చేయండి.. 6 నెలల్లో పీవోకే మనదే.. యోగి సంచలన వ్యాఖ్యలు 

మే 5 నుంచి 11వ తేదీ మధ్యలో 25,900 కొత్త కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ మంత్రి కుంగ్ తెలిపారు. ప్రజలు మళ్లీ మాస్కులు ధరించాలని.. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కేపీ.2 వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. అలాగే హాస్పిటల్ పడకల సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలని అన్నారు. వచ్చే రెండు నుంచి నాలుగు వారాల్లో కొవిడ్ కేసులు గరిష్ఠస్థాయిలో పెరుగుతాయని.. జూన్ మధ్య వరకు కేసులు అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఏప్రిల్ చివరివారంలో 13,700 కేసులు నమోదయ్యయాని తెలిపారు.

Also Read: ఆఫ్ఘనిస్తాన్ లో మళ్ళీ వరద బీభత్సం.. 68 మంది మృతి!

Advertisment
Advertisment
తాజా కథనాలు