TG Govt : కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. కశ్మీర్ ప్రాంతాల్లో చిక్కుకున్న తెలంగాణవారిని సురక్షితంగా తిరిగి రప్పించడానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది.ఈ మేరకు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కశ్మీర్‌లో చిక్కుకున్నవారిని తిరిగి రప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పర్యటకులకు తగిన సహాయం అందిస్తామని వెల్లడించారు. ఈ ఘటనపై తెలంగాణ పర్యటక శాఖ అధికారులు.. ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులతో పాటు కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేస్తూ పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఉగ్రదాడిలో తెలంగాణ వారు ఎవరు మరణించలేదన్న ఆయన పర్యాటకులు ఎవరైన కశ్మీర్ పర్యటనకు వెళ్లి ఉంటే సమాచారం ఇవ్వాలని కోరారు. దానికోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Also Read: BIG BREAKING: మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్!
అలాగే ఇటీవల జమ్ము, కశ్మీర్ లో పర్యటించిన పర్యటకుల వివరాలు వెంటనే అందించాలని తెలంగాణలోని అన్ని టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లను మంత్రి జూపల్లి కోరారు. దీనివల్ల పర్యటకుల స్థితిగతులను పర్యవేక్షించేందుకు అవసరమైన సమయంలో ప్రభుత్వ సహాయాన్ని అందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర పర్యటక శాఖ ఆధ్వర్యంలో హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేశామని, కశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణ పర్యటకుల సహాయం కోసం నిరంతరం ఫోన్ ద్వారా సేవలు అందించేందుకు ఈ హెల్ప్ లైన్ నెంబర్ అందుబాటులో ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఏ విషయమైన హెల్ప్ లైన్ నంబర్లు: 9440816071, 9010659333, 040 23450368 లకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఇది కూడా చదవండి: ఇంట్లో బల్లుల బెడద ఎక్కువగా ఉందా ఇలా తరిమేయండి
పర్యటకుల బంధువులు లేదా స్నేహితులు కూడా తమ సమాచారం అందించేందుకు, లేదా సహాయం కోసం ఈ నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.కశ్మీర్‌తో పరిసర ప్రాంతాల్లో పర్యటకులు ఎవరైనా చిక్కుకున్నా వారి నుంచి బంధువులకు ఎలాంటి సమాచారం వచ్చిన వెంటనే హెల్ప్‌లైన్ సెంటర్లకు సమాచారం ఇవ్వాలని మంత్రి కోరారు.
Also Read:దుబాయ్ నుంచి బ్యాగ్ తెచ్చిన భర్త.. చంపి అదే బ్యాగ్‌లో ప్యాక్ చేసిన భార్య.. ఎలా దొరికిందంటే?
Also Read: Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ మృతి.. హర్ష కుమార్ కు సోనియా గాంధీ సంచలన లేఖ!