Google Maps: గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకున్నారు.. ఎడారిలో ఇరుక్కున్నారు..! అమెరికాలోని లాస్ వేగాస్ నుంచి లాస్ ఏంజెల్స్‌కి బయలుదేరిన షెల్బీ కుటుంబం గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకోని ఎడారిలో ఇరుక్కుపోయింది. షార్ట్ కట్ అంటూ నెవిగేషన్ ఆన్ చేసుకోని మ్యాప్స్‌ను ఫాలో అవ్వగా కార్లు కాస్త ఇసుకలో పేరుకుపోయాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని గూగుల్ ప్రకటించింది. By Trinath 24 Nov 2023 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి 'అటు రోడ్డు లేదు.. ఎడారి ఉంది..' అటు వైపుకు వెళ్లొద్దు.. అని ఓ ట్రక్కు డ్రైవర్ మంచిగా చెప్పాడు. అయినా వినలే.. గూగుల్ మ్యాప్స్(Google Maps).. టెక్నాలజీ అంటూ ముందుకు పొనిచ్చారు.. కార్ల అద్దాలపైకి ఇసుక దూసుకొస్తున్నా వారికి అర్థంకాలేదు. గుడ్డిగా గూగుల్ మ్యాప్స్‌ను అనుసరించారు. తీర చివరకు ఇసుకులో ఇరుక్కుపోయారు. అదంతా ఎడారి.. తెలియకుండానే ఎడారిలోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుంగా అందులో చాలా దూరం తమ కార్లను పొనిచ్చి ఇరుక్కుపోయారు. అమెరికాలో జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. షార్ట్ కట్ కోసం: గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకోని ప్రయాణాలు చేసే రోజులివి. టెక్నాలిజీని ఉపయోగించుకోకపోతే పనులు జరగడంలేదు. ప్రతీ చిన్నపనికి టెక్నాలజీపై ఆధారపడిపోతున్నాం. అయితే టెక్నాలజీపై అతిగా ఆధారపడితే తగిన మూల్యం చెల్లుంచుకోకతప్పదు. అమెరికాకు చెందిన షెల్బీ ఈస్లర్, ఆమె సోదరుడు ఆస్టిన్, వారి పార్ట్‌నెర్స్ లాస్ వెగాస్‌లో ఫార్ములా-1 రేసుకు హాజరయ్యారు. తర్వాత లాస్ ఏంజెల్స్(Los Angeles)కు తిరిగి వెళ్లాలి. రెండు నగరాలను కలిపే ప్రధాన రహదారి కాకుండా షార్ట్ కట్ ఉందని గూగుల్ మ్యాప్స్‌లో కనిపిస్తోంది. దీంతో డిస్టెన్స్ తగ్గుతుందని, టైమ్ సేవ్ అవుతుందని గూగుల్ మ్యాప్స్‌ను ఫాలో అయ్యారు. తీరా కట్ చేస్తే గమ్యస్థానానికి చేరుకోకపోగా ఎడారిలో ఇరుక్కుపోయారు. వద్దని చెప్పిన ట్రక్క్ డ్రైవర్: షెల్బీ టీమ్ రాంగ్ రూట్ వెళ్తుందని ఎదురుగా వస్తున్న ఓ ట్రక్కు డ్రైవర్‌కు అర్థమైంది. వెంటనే షెల్బీ కార్‌ను ట్రక్కు డ్రైవర్ ఆపామని సైగ చేశాడు. ఆమె ఆపి ఏంటని అడిగింది. ఎక్కడికి వెళ్తున్నారని అతను రివర్స్ అడిగాడు. లాస్ ఏంజెల్స్ అని ఆమె బదులు ఇచ్చింది. అతను వెంటనే ఇటు సైడ్ వెళ్తే లాస్ ఏంజెల్స్‌రాదని వెనక్కి వెళ్లిపోమని సూచించాడు. అయితే షెల్బీ మాత్రం పట్టించుకోలేదు. ఇతనికి గూగుల్ మ్యాప్స్ తెలియదు కాబోలు అని నావిగేషన్‌నే పట్టుకోని ముందుకు పొనిచ్చింది. తీరా ఎడారిలో ఇరుక్కున్న తర్వాత సాయం కోసం ప్యాట్రోల్ వారికి ఫోన్ చేసినా లాభం లేకపోయింది. దీంతో టోయింగ్ ట్రక్కు వారికి ఫోన్ చేసి.. ఎడారి ప్రాంతానికి రమ్మని చెప్పారు. టోయింగ్ ట్రక్కు సాయంతో కార్లు ఎట్టకేలకు ఇసుక నుంచి బయటకు వచ్చాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని గూగుల్ ప్రకటించింది. Also Read: రోహిత్ శర్మ నాటౌటా? హెడ్ క్యాచ్‌పై సోషల్‌మీడియాలో రచ్చ..! WATCH: #viral-news #google-maps #america మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి