Plane: ఘోరం.. ఇంటిపైనే కూలిన విమానం.. పూర్తిగా కాలిపోయిన ఇల్లు అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ ఇంటిపై చిన్న విమానం కూలింది. ఈ ప్రమాదంలో ఆ ఇల్లు పూర్తిగా కాలిపోగా.. మరో మూడు ఇళ్లు ధ్వంసమయ్యాయి. మృతుల సంఖ్యను అధికారులు ఇంకా వెల్లడించలేదు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. By B Aravind 02 Feb 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి అమెరికాలోని ఫ్లోరిడాలో విషాదం చోటుచేసుకుంది. ఏకంగా ఓ ఇంటిపైనే చిన్న విమానం కూలిపోవడం కలకలం రేపింది. ఆ ఇల్లు పూర్తిగా దగ్దమైపోగా.. మరో మూడు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ దుర్ఘటనలో పైలట్‌తో పాటు విమాన ప్రయాణికులు, ఆ ఇంట్లో ఉన్న వారితో కలిసి మృతులు సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అధికారులు ఇంకా మృతుల సంఖ్యను అధికారికంగా ప్రకటించలేదు. సమాచారం మేరకు ఘటనాస్థలంలోకి చేరుకున్న అగ్నమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు. Also Read: బలగాల ఉపసంహరణపై భారత్ – మాల్దీవుల మధ్య భేటీ.. ఈ ప్రమాదానికి సంబంధించి క్లియర్ వాటర్ ఫైర్ అండ్ రెస్క్యూ విభాగం తమ ఎక్స్ (ట్విట్టర్)లో వీడియో షర్ చేసింది. ఈ వీడియోలో విమానం కూలిన ప్రదేశంలో మంటలు వ్యాపించడం అలాగే విమానానికి సంబంధించిన అవశేషాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మేము ప్రమాద స్థలం వద్దే ఉన్నామని.. ఇళ్లు దగ్దమయ్యాయని.. వివిధ ప్రాంతాల నుంచి అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారని అధికారులు చెప్పారు. We’re on scene of a small plane crash at a mobile home park south of Clearwater Mall. Multiple mobile homes have caught fire. Firefighters from multiple jurisdictions are on scene. pic.twitter.com/1vBLnTnY8R — Clearwater Fire & Rescue Department (@clearwaterfire) February 2, 2024 అయితే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపిన వివరాల ప్రకారం చూసుకుంటే.. బీచ్‌క్రాఫ్ట్ బొనాంజా వి35 అనే విమానం కూలే ముందు పైలెట్ ఇంజిన్‌లో జరిగిని వైఫల్యాన్ని గుర్తించి సమీపంలో ఉన్న విమానశ్రయానికి సమాచారం అందించాడు. కానీ మొబైల్ హోం పార్క్ సమీపంలో రన్‌వేకి 5 కిలోమీటర్ల దూరంలో ఫ్లైట్ రాడర్ నుంచి విడిపోయినట్లు అగ్నిమాపక చీఫ్ ఎహ్లర్స్ పేర్కొన్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సెఫ్టీ బోర్ట్ దర్యాప్తు చేస్తోంది. Also Read: అగ్ర రాజ్యంలో మరో భారతీయ విద్యార్థి మృతి..వారంలో మూడో కేసు! #telugu-news #flight #plane-crash #plane-crashed మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి