Movies: హాట్ టాపిక్‌గా సమంత రెమ్యునరేషన్

టాలీవుడ్ స్టర్ హీరోయిన్ ఏడాదిగా మూవీస్ చేయడం లేదు. అయినా కూడా తన సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా లైమ్ లైట్‌లో ఉంటూనే వచ్చింది. ఇప్పుడు సీటా డెల్ వెబ్ సీరీస్ ద్వారా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది సమంత. ఆ సీరీస్ కోసం తను తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది.

New Update
ఈ హీరోయిన్లు ఏం చదువుకున్నారో తెలుసా?

Samantha remunaration: సమంత ఏడాది సినిమాలకు గ్యాప్ ఇచ్చి తన హెల్త్ మీద ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇప్పుడిప్పుడే వరుసగా సినిమాలు, సిరీస్ లు ఓకే చేస్తుంది. సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ అమెజాన్ ఓటీటీలో నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సిరీస్ తో సమంత మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సిరీస్ టీజర్ రిలీజవ్వగా ఇందులో సమంత యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టింది.అయితే ఈ సిరీస్ కి సమంత తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు చర్చగా మారింది. సాధారణంగా బాలీవుడ్ లో హీరోయిన్స్ కి కూడా రెమ్యునరేషన్ ఎక్కువే ఇస్తారని తెలిసిందే. అయితే సమంత సిటాడెల్ సిరీస్ కి గాను ఏకంగా 10 కోట్ల రెమ్యునరేషన్ అందుకుందని బాలీవుడ్ సమాచారం.

బాలీవుడ్ లో ఇంత రెమ్యునరేషన్ అందుకున్న ఫస్ట్ సౌత్ హీరోయిన్ కూడా సమంతనే అని అంటున్నారు. సాధారణంగా సమంత రెండు నుంచి మూడు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. సౌత్ లో గరిష్టంగా నయనతార 5 నుంచి 8 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. నయనతార జవాన్ సినిమాకు బాలీవుడ్ లో 8 నుంచి 10 కోట్ల మధ్య రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం. ఇప్పుడు సమంత సిటాడెల్ కు 10 కోట్లు తీసుకుంది. దీంతో నయనతార, సమంతలో ఎవరు ఎక్కువ తీసుకున్నారు అని చర్చగా మారింది. అలాగే వీరిద్దరిలో బాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న ఫస్ట్ సౌత్ హీరోయిన్ ఎవరు అని కూడా ఫ్యాన్స్ లో చర్చ జరుగుతోంది.

Also Read: Telangana: ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు ప్రారంభం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack-Tollywood: క్షమించరాని క్రూరమైన చర్య..ఉగ్రదాడిని ఖండించిన సినీ ప్రముఖులు!

పహల్గాం ఉగ్రదాడి పై టాలీవుడ్‌ ప్రముఖులు స్పందించారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు.మెగాస్టార్‌ చిరంజీవితో పాటు, తారక్‌,చరణ్‌, బన్నీ వంటి వారు సోషల్‌ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేశారు.

New Update
tollywood

tollywood

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం లో జరిగిన ఉగ్రదాడి యావత్ భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కశ్మీర్ అందాలు చూడడానికి వచ్చిన పర్యాటకుల మీద ఉగ్రవాదులు మారణకాండకు తెగబడ్డారు. ప్రజల మీద పాశవికంగా దాడి చేశారు. ఆ ఘటనలో మొత్తం 28 మంది మరణించారు. ఈ విషాదం పట్ల  టాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ సంతాపాన్ని తెలియజేశారు.

''పహల్గం లో 26 మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న ఉగ్రదాడి‌ అత్యంత దారుణమైన చర్య. ఇది క్షమించరాని క్రూరమైన చర్య. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. వారికి కలిగిన నష్టం ఎవరూ పూడ్చలేనిది'' అని చిరంజీవి పేర్కొన్నారు. 

''పహల్గాం బాధితులను చూస్తుంటే నా గుండె బరువెక్కి పోతుంది. ఈ దాడిలో మరణించిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

'పహల్గాం టెర్రర్ ఎటాక్ వార్త విని షాక్ అయ్యాను. ఎంతో బాధ కలిగింది. ఈ తరహా ఘటనలకు మన సమాజంలో చోటు లేదు. దీనిని ప్రతి ఒక్కరు తీవ్రంగా ఖండించాలి. బాధిత కుటుంబాల కోసం ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను'' అని రామ్ చరణ్ పేర్కొన్నారు.

''పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆ వార్త విని నా హృదయం ముక్కలైంది. మృతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా'' అని అల్లు అర్జున్ పోస్టు చేశారు. సాయి దుర్గా తేజ్, విష్ణు మంచు సహా పలువురు తెలుగు సినిమా ప్రముఖులు...‌‌ బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, సంజయ్ దత్, జాన్వీ కపూర్, సోనూ సూద్ తదితరులు ఈ దాడిని ఖండించారు.

Also Read: Pahalgam terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన పుతిన్..!

Also Read: Pahalgam Attack: ప్రధాని టూర్ లో..జేడీ వాన్స్ ఇండియాలో..ముంబై తరహాలో ఉగ్రదాడి..టార్గెట్ ఎవరు?

tollywood | Pahalgam attack | latest-news | jr-ntr | telugu-news

Advertisment
Advertisment
Advertisment