/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-8-3-jpg.webp)
Samantha : స్టార్ నటి సమంత(Samantha) యంగ్ హీరో అల్లు అర్జున్(Allu Arjun) పై ప్రశంసలు కురిపించింది. నటనలతో బన్నీనే ఆదర్శంగా తీసుకుంటానని చెప్పింది. ఈ మేరకు రీసెంట్ గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమంత అభిమానులతో సరదాగా ముచ్చటించింది. తనకు సంబంధించిన అనేక విషయాలపై మాట్లాడుతూ తన ఫేవరేట్ హీరో ఎవరో చెప్పేసింది.
View this post on Instagram
నటనలో స్ఫూర్తి..
ఈ మేరకు ఇటీవల ఓ కాలేజీ ఫంక్షన్‌లో పాల్గొన్న సమంతను కొందరు స్టూడెంట్స్ ‘నటనలో మీకు స్ఫూర్తి ఎవరు?’ అని ప్రశ్నించారు. దీనికి ‘యాక్టింగ్‌లో నాకు అల్లు అర్జునే స్ఫూర్తి. తనతో కలిసి మరోసారి నటించాలనుకుంటున్నా. ఎందుకంటే యాక్టింగ్ బీస్ట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు’ అంటూ తెగ పొగిడేసింది. ప్రస్తుతం ఈ వీడియోను బన్నీ ఫ్యాన్స్ షేర్ చేస్తుండగా తెగ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
View this post on Instagram
ఇది కూడా చదవండి: JOBS: NALCO 277 ఉద్యోగాలు.. భారీ వేతనాలు!
ఇక వీరిద్దరి కలయికలో ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’(Son Of Satyamurthy) సినిమా వచ్చింది. త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’లో అల్లు అర్జున్, సమంత ‘ఊ అంటావా..’ పాటలో చిందేశారు. ఈ పాట సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో పాటు కొన్ని కోట్ల వ్యూస్‌తో రికార్డును సృష్టించింది.