Samajwad Party: కాంగ్రెస్‌కు సమాజ్‌వాద్‌ పార్టీ ఆఫర్‌.. కానీ ఒక షరతు..

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు.. సమాజ్‌వాదీ పార్టీ ఓ ఆఫర్‌ను ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు.. ముందుగా కాంగ్రెస్‌కు 11 స్థానాలనే కేటాయించినప్పటికీ.. ఆ తర్వాత వీటి సంఖ్యను 17కు పెంచింది. ఈ ఆఫర్‌ను అంగీకరిస్తే తాము మద్దతిస్తామని షరతు పెట్టింది.

New Update
Samajwad Party: కాంగ్రెస్‌కు సమాజ్‌వాద్‌ పార్టీ ఆఫర్‌.. కానీ ఒక షరతు..

Samajwad Party: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల రంగంలోకి దిగుతున్నాయి. ఓవైపు మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ.. మరోవైపు మోదీ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ఇండియా కూటమి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇండియా కూటమిలో ప్రాంతీయ పార్టీల మధ్య ఇప్పటికీ సీట్ల సర్దుబాటు కాలేదు. దీనికి తోడు.. కీలక నేతలైన ఢిల్లీ సీఎం అరవింద్ కెజ్రీవాల్, బిహార్‌ సీఎం నితిష్‌ కుమార్, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీలు ఇండియా కూటమిని వీడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కూటమికి పెద్ద ఎదురుదెబ్బ తగినట్లైంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ కీలక ప్రకటన చేసింది.

Also Read: ఇండియా కూటమితో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన మాయావతి

దీనికి ఒప్పుకుంటేనే మద్దతు

లోక్‌సభ ఎన్నికల కోసం యూపీలో సమాజ్‌వాద్‌ పార్టీ.. ముందుగా కాంగ్రెస్‌కు 11 స్థానాలనే కేటాయించినప్పటికీ.. ఆ తర్వాత వీటి సంఖ్యను 17కు పెంచింది. ఈ ఆఫర్‌ను అంగీకరిస్తేనే తమ మద్దతు ఉంటుందని షరతు పెట్టింది. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 52 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇక యూపీలోని రాయ్‌బరేలీ, అమెఠీ స్థానాలు హస్తం పార్టీకి కంచుకోటల లాంటివి. కానీ అమేఠీలో.. బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోయారు. దీంతో ఒక్క రాయ్‌బరేలీలో మాత్రమే కాంగ్రెస్‌ గెలిచింది.

రాహల్ యాత్రలో అఖిలేష్..?

అయితే సమాజ్వాది పార్టీ ఇచ్చిన ఆఫర్‌పై కాంగ్రెస్ ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రలో ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్ పాల్గొంటారని.. పార్టీ సీనియర్ లీడర్‌ జైరాం రమేశ్‌ తెలిపారు. ఇండియా కూటమిలో సీట్ల కేటాయింపుపై ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల.. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటన చేసింది. ఇక ఢిల్లీలో కాంగ్రెస్‌కు ఆప్‌ ఒక్క సీటు మాత్రమే ఆఫర్ చేసింది. మరోవైపు బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు.

Also Read: ముగిసిన నాలుగో విడత చర్చలు.. ఆ పంటలకే కనీస మద్దతు ధర

Advertisment
Advertisment
తాజా కథనాలు