మైక్రోసాఫ్ట్ లోకి ఓపెన్ ఏఐ మాజీ సీఈవో సామ్ ఆల్టన్..

New Update
మైక్రోసాఫ్ట్ లోకి ఓపెన్ ఏఐ మాజీ సీఈవో సామ్ ఆల్టన్..

సామ్ ఆల్టన్...ఓపెన్ ఏఐ సీఈవోగా చేశారు. కొన్ని కారణాల చేత ఆల్ట్‌మన్‌ న్ని CEO విధుల నుండి తొలిగించారు. దీంతో ఆయన కలీగ్ అయిన గ్రెగ్ బ్రాక్‌మన్‌ కూడా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. వీరితో పాటూ మరో ముగ్గురు కూడా ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇంకా కొంతమంది కూడా ఉద్యోగాలను వదిలేయడానికి రెడీగా ఉన్నారని సమాచారం. అయితే సామ్ ఆల్టన్ చాలా టాలెంటెడ్. ఇతని లాంటి వారిని ఎవరు వదులుకుంటారు. అందుకే సామ్ ను తొలగించిన వెంటనే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ వారిద్దరినీ తమ కంపెనీలోకి తీసేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ కూడా చేశారు.

Also Read:తెలంగాణలో 49 కేంద్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

ఈ ట్వీట్ లో ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగులు అయినటువంటి ఆల్ట్‌మన్‌, గ్రెగ్ బ్రాక్‌మన్‌ మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో చేరుతున్నారని.. ఇక మీదట ఏఐ రీసెర్చ్ టీమ్‌ని వీళ్లిద్దరూ కలిసి లీడ్ చేస్తారని సత్య నాదెళ్ళ చెప్పారు. ఈ నేపథ్యంలో వాళ్లకు కావాల్సిన వనరులను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

సత్య నాదెళ్ల పోస్ట్‌ను సామ్ ఆల్ట్‌మాన్ షేర్ చేశారు. దానికి ది మిషన్ కంటిన్యూస్ అనే పేరు పెట్టారు.

Also Read:నవంబర్ 23 తర్వాత ప్రచార హోరుతో దద్దరిల్లనున్న తెలంగాణ

Advertisment
Advertisment
తాజా కథనాలు