Russia: రెండేళ్ళయినా పట్టువదలని రష్యా..ఉక్రెయిన్‌పై మళ్ళీ దాడి రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం మొదలై రెండేళ్ళు దాటి మూడో ఏడాదిలోకి అడుగుపెడుతోంది. అయినా ఇంకా కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది రష్యా. ఇంకా ఉక్రెయిన్ క్షిపణులను ప్రయోగిస్తూనే ఉంది. తాజాగా రష్యా ప్రయోగించిన క్షిపణుల వలన 17 మంది మృతి చెందారు. By Manogna alamuru 18 Apr 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Russia Attacked Again On Ukraine: ఉక్రెయిన్‌ను వదలడం లేదు రష్యా. రెండేళ్ళుగా దండయాత్ర చేస్తూనే ఉంది. తాజాగా ఉక్రెయిన్‌లో చెర్నిహివ్‌పై రష్యా క్షిపణుల వర్షం కురింపించింది. ఇందులో ఎనిమిది అంతస్తు బవనం కూలిపోయి 17 మంది మృతి చెందారు. దీంతో పాటూ ముగ్గురు చిన్నారుల సహా 61 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు ఉత్తరాన 150 కిలోమీటర్ల దూరంలో రష్యా - బెలారస్ సరిహద్దులకు సమీపంలోని చెర్నిహీవ్ ప్రాంతంపై స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9 గంటలకు ఈ దాడి చోటుచేసుకుంది. క్షిపణి పడిన భవనంలో ఓ ఆసుపత్రి, విద్యాసంస్థ ఉందని ఉక్రెయిన్ ఎమెర్జెన్సీ విభాగం వెల్లడించింది. ఈ దాడికి చెందిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆసుపత్రి లోపల పొగతో నిండిన కారిడార్‌లను ఖాళీ చేయడం, ఆసుపత్రి పడకలపై కిటికీలు పగిలిన గాజు పెంకులు, తలుపులు ఊడిపోయి కనిపిస్తున్నాయి. క్షిపణఇ పడుతున్నప్పుడు జనాలు ఆ భవనం చుట్టూ ఉన్నారు. దాని నుంచి తప్పించుకోవడానికి బస్ స్టాప్ పక్కన దాక్కున్నారు. చనిపోయినవారిలో 25 ఏళ్ల పోలీస్ అధికారి లెఫ్టినెంట్ ఎలినా మ్యుకోలైట్స్ ఉన్నట్టు వెల్లడించారు. ఫ్రిబ్రవరి 24, 2022 నుంచి రష్యా- ఉక్రెయిన్ మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. రష్యా అప్పటి నుంచి ఉక్రెయిన్ మీద దాడులు చేస్తూనే ఉంది. ఆ దేశం దాడులను ఉక్రెయిన్ కూడా సమర్ధవంతంగా అడ్డుకుంటోంది. ఈ ఇరు దేశాల మధ్య దాడుల్లో ఇప్పటికే వేలమంది చనిపోయారు. Also Read:Indonesia: ఇండోనేషియాలో బద్ధలైన అగ్నిపర్వతం…సునామీ హెచ్చరికలు జారీ #attack #ukraine #russia #missile మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి