Cancer Vaccine: క్యాన్సర్‌కు వ్యాక్సిన్ తయారు చేస్తున్నాం.. త్వరలోనే అందుబాటులోకి: పుతిన్ క్యాన్సర్‌కు రష్యా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్‌ను తయారుచేస్తున్నారని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ తయారీ.. కీలక దశలో ఉందని.. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. By B Aravind 15 Feb 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Russian President Vladimir Putin: ప్రపంచాన్ని వణికిస్తున్న అతి భయంకరమైన వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ఇప్పటివరకు ఈ వ్యాధికి సరైన మందు లేదు. క్యాన్సర్ బారినపడి ఏటా లక్షలాది మంది ప్రాణలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి తాజాగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్యాన్సర్‌కు రష్యా శాస్త్రవేత్తలు (Russian Scientists) వ్యాక్సిన్‌ను తయారుచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ (Cancer Vaccine) తయారీ.. కీలక దశలో ఉందని.. త్వరలోనే ప్రజలకు అందుబాటులకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. Also Read: పెన్షన్లలో కేసీఆర్ సర్కార్ అవినీతి.. కాగ్ సంచలన రిపోర్ట్ త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నా మాస్కోలోని భవిష్యత్తు సాంకేతికతలపై నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా పుతిన్ మాట్లాడారు. ' క్యాన్సర్ వ్యాక్సిన్, రోగనిరోధక శక్తిని పెంచే కొత్త మందు తయారీకి అతి దగ్గర్లో ఉన్నాం. రాబోయే రోజుల్లో వీటిని చికిత్సల్లో ఉపయోగిస్తారని ఆశిస్తున్నానని' అన్నారు. అయితే క్యాన్సర్లలో కూడా వివిధ రకాలుంటాయి. రష్యా శాస్త్రవేత్తలు తయారుచేస్తున్న వ్యాక్సిన్ ఏ రకమైన క్యాన్సర్లను నయం చేస్తుందనే దానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. క్యాన్సర్‌కు టీకా తయారుచేస్తున్న పలు దేశాలు అయితే ఇప్పటికే కొన్ని దేశాలు వివిధ రకాల కాన్సర్లకు వ్యాక్సిన్‌లు తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. జర్మనీకి (Germany) చెందిన బయోఎన్‌టెక్ అనే సంస్థతో.. బ్రిటన్ ప్రభుత్వం క్యాన్సర్ వ్యాక్సిన్ కోసం ఒప్పందం చేసుకుంది. 2030 నాటికి 10 వేల మంది రోగులకు దీన్ని ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' (WHO) నివేదిక ప్రకారం.. కొన్ని రకాల క్యాన్సర్లకు కారణమయ్యే హ్యుమన్ పాపిలోమా అనే వైరస్‌ను కట్టడి చేసేందుకు.. అలాగే కాలేయ క్యాన్సర్‌కు కారణమయ్యే హెపటైటిస్-బి నివారణకు అవసరమయ్యే 6 టీకాలకు అనుమతులు వచ్చేశాయి. భారత్‌కు ప్రయోజనం ఇదిలాఉండగా.. భారత వైద్య పరిశోధన మండలి (ICMR) గణాంకాల ప్రకారం చూసుకుంటే.. భారత్‌లో 2026 నాటికి 20 లక్షల మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని అంచనా. భారత్‌లో (India) 2019లో ఏకంగా 12 లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 9.3 లక్షల మంది మరణించినట్లు లాన్సెట్ అనే జర్నర్‌లో ప్రచూరితమైంది. అయితే రష్యా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి సమర్థమంతగా క్యాన్సర్‌ను ఎదుర్కొంటే భారత్‌కు ఎంతగానో ప్రయోజనం ఉండనుంది. Also Read: టాబ్లెట్ వేసుకొని శృంగారంలో రెచ్చిపోయాడు.. చివరికి #telugu-news #cancer #russia #vladimir-putin #cancer-vaccine మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి