IND VS AFG : పొట్టి ఫార్మెట్‌లోకి బాస్‌, కింగ్ రీఎంట్రీ.. అఫ్ఘాన్‌తో సిరీస్‌కు జట్టు ప్రకటన!

జనవరి 11 నుంచి స్వదేశంలో అఫ్ఘాన్‌తో జరగనున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. సుదీర్ఘ విరామం తర్వాత పొట్టి ఫార్మెట్‌లోకి రోహిత్‌, కోహ్లీ రీఎంట్రీ ఇచ్చారు. కెప్టెన్‌గా రోహిత్‌ వ్యవహరించనున్నాడు. ఈ ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్‌కప్‌ జరగనున్న విషయం తెలిసిందే!

New Update
IND VS AFG : పొట్టి ఫార్మెట్‌లోకి బాస్‌, కింగ్ రీఎంట్రీ.. అఫ్ఘాన్‌తో సిరీస్‌కు జట్టు ప్రకటన!

T20 World Cup : సస్పెన్స్‌కు తెరపడింది. టీ20 జట్టులోకి రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్‌ కోహ్లీ(Virat Kohli) రీఎంట్రీ ఇస్తారా లేదా అన్నది తేలిపోయింది. రోహిత్‌, కోహ్లీ ఆసక్తిమేరకు జట్టులోకి ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు తిరిగి వచ్చారు. జనవరి 11 నుంచి స్వదేశంలో ఇండియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుండగా.. వారిని ఎంపిక చేశారు. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ కొనసాగడనుండడం విశేషం. నిజానికి ఈ ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌(T20 World Cup)కు భారత్‌ జట్టుకు కొత్త కెప్టెన్‌ ఉంటాడన్న ప్రచారం జోరుగా సాగింది. రోహిత్‌, కోహ్లీను పొట్టి ఫార్మెట్‌కు దూరంగా ఉంచాలని.. ఇద్దరి వయసు దృష్ట్యా, భవిష్యత్‌ ప్రణాళికల కోసం యువకులకు ఛాన్స్ ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్టుగా అందరూ అనుకున్నారు. కానీ వెటరన్‌ ఆటగాళ్లతోనే మరో టీ20 వరల్డ్‌కప్‌కు వెళ్లాలని బీసీసీఐ తన ప్లాన్‌ను మార్చుకున్నట్టుగా సమాచారం.

ఇద్దరూ ఇప్పటికీ టాపే:
2022లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా సెమీస్‌లో ఓడిపోయింది. ఆ మ్యాచ్‌ తర్వాత రోహిత్‌, కోహ్లీ, రాహుల్(Rahul) ముగ్గురూ కూడా అంతర్జాతీయంగా మరో టీ20 మ్యాచ్‌ ఆడలేదు. గతేడాది(2023) వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌లో ఓటమి తర్వాత టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో పాటు సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికా పిచ్‌లపై పొట్టి సిరీస్‌లో తలపడింది. ఈ రెండు సిరీస్‌లకు సైతం స్టార్‌ త్రయం దూరంగా ఉంది. అయితే అఫ్ఘాన్‌(Afghanistan) తో సిరీస్‌కు రోహిత్‌, కోహ్లీ వారికివారుగా ఆసక్తిని కనబరిచారు. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఉండాలని సినీయర్లు ఇద్దరు భావిస్తూ ఉండవచ్చు. వారిని అభిప్రాయానికి గౌరవం ఇచ్చిన బీసీసీఐ(BCCI) అఫ్ఘాన్‌ సిరీస్‌కు ఎంపిక చేసింది. నిజానికి రోహిత్‌, కోహ్లీ ఇద్దరూ టీ20ల్లో టాప్‌ ప్లేయర్లే. ఇప్పటికీ టీమిండియా(Team India) కు ప్రధాన ఆటగాళ్లే. అయితే టీ20లకు యువకులకు మంచి ఫ్లాట్‌ఫామ్‌ అని తెలిసిందే. అందుకే యువ జట్టును రెడీ చేయాలని సెలక్టర్లు ముందుగా భావించారు. అటు కేఎల్‌ రాహుల్‌కు మాత్రం టీ20 జట్టులోకి కాల్‌ రాలేదు.

అఫ్ఘానిస్థాన్‌తో టీ20లకు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), ఎస్ గిల్, వై జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకు సింగ్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, డబ్ల్యూ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్

Also Read: గర్భనిరోధక మాత్రలు తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు