Cricket: ద్రవిడ్ కంటే ముందే 5 కోట్లు వదులుకునేందుకు సిద్ధపడిన రోహిత్

టీమ్ ఇండియాకు బోనస్‌గా బీసీసీఐ 125 కోట్లు ప్రకటించింది. ఆటగాళ్ళతో పాటూ కోచ్ ద్రావిడ్‌కు కూడా 5 కోట్లు ఇవ్వడానికి నిర్ణయించారు. అయితే ద్రావిడ్ అందులో సగం వదులుకుంటానన్నాడు. కానీ అంతకు ముందే కెప్టెన్ రోహిత్ కూడా తన బోనస్ మొత్తాన్ని వదులుకునేందుకు సిద్ధపడ్డాడని తెలుస్తోంది.

New Update
Cricket: ద్రవిడ్ కంటే ముందే 5 కోట్లు వదులుకునేందుకు సిద్ధపడిన రోహిత్

Captain Rohith Sarma: టీమ్ ఇండియా క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్‌ ద్రావిడ్‌లు ఒకరితో ఒకరు పోటీ పడుతూ పెద్ద మనసు చాటుకుంటున్నారు. సహాయక సిబ్బంది కోసం తమ బోనస్ లను వదులుకోవడానికి సిద్ధపడ్డారు. కోచ్ రాహుల్ ద్రావిడ్ తనకు అందించే బోనస్‌ను సగానికి తగ్గించాలని బీసీసీఐని కోరారు. మిగతా కోచ్‌లకు ఇచ్చిన విధంగానే రూ.2.5 కోట్లు ఇవ్వాలని ద్రవిడ్ విజ్ఞప్తి చేశాడు. అయితే అంతకు ముందే కెప్టెన్ రోహిత్ శర్మ తన ప్రైజ్ మనీ మొత్తాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డాడని చెబుతున్నారు. జట్టు గెలుపు కోసం శ్రమించిన సహాయక సిబ్బందిలో అందరికీ సమానంగా డబ్బు అందాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జట్టు గెలుపు కోసం త్రోడౌన్‌ స్పెషలిస్ట్‌లు, మసాజర్స్‌, ఫిజియోలు ఇలా ఎంతోమంది శ్రమించారు. తక్కువ వేతనం వచ్చిన సహాయ సిబ్బందిలో అందరికీ సమానంగా నా ప్రైజ్‌ మనీ చెందాలని ఆశిస్తున్నా అని రోహిత్ చెప్పాడు.

టీ20 వరల్డ్‌కప్‌ స్క్వాడ్‌లోని 15 మంది ప్లేయర్లకు రూ.5 కోట్లు చొప్పున అనౌన్స్ చేసింది బీసీసీఐ. రిజర్వ్‌ ఆటగాళ్లకు రూ.కోటి.. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్‌ దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ఒక్కొక్కరికి రూ.2.5 కోట్లు, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్ అగార్కర్‌తో సహా సెలక్షన్ కమిటీ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.కోటి ప్రకటించారు. సహాయక సిబ్బందిలో ముగ్గురు ఫిజియోథెరపిస్ట్‌లు, ముగ్గురు త్రోడౌన్ స్పెషలిస్టులు, ఇద్దరు మసాజర్‌లు, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌లకు ఒక్కొక్కరికి రూ.2 కోట్లు అందించాలని బీసీసీఐ నిర్ణయించింది.

Also Read:Ambani’s Wedding: 3 వేల వంటకాలు..1500 కోట్లు ఖర్చు..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

pahalgam terrorist attack: హిమాచల్ ప్రదేశ్ లో హై అలెర్ట్..ఉగ్రదాడి జరగొచ్చనే హెచ్చరికలు

టెర్రరిస్టులు ఇంకా భారత్ లోనే ఉన్నారు. వారి కోసం భద్రతా దళాల వేట కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పహల్గామ్ తరహాలో మరోసారి ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. దీంతో హిమాచల్ ప్రదేశ్ లో హై అలెర్ట్ ప్రకటించారు. 

New Update
india

High Alert In Himachal Pradesh

కాశ్మీర్ లో పహల్గామ్ లోని బైసరన్ వ్యాలీలో దాడులు జరిగి రెండు రోజులు అవుతున్నా దాని నుంచి ఇంకా కోలుకోలేదు. యావత్ భారతదేశం శోక సంద్రంలో మునిగిపోయింది. ఉగ్రవాదుల మీద కోపంతో రగిలిపోతోంది. ఉగ్రవాదుల తలలు కావాలని దాడిలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు అడుగుతున్నారు. కేంద్రం కూడా ఈ ఉగ్రదాడిని తీవ్రంగా తీసుకుంది. ఇందులో భాగంగా నిన్న పాకిస్తాన్ మీద కఠిన చర్యలు తీసుకుంది. ఆ దేశంతో దౌత్యపరమైన సంబంధాలను క్యాన్సిల్ చేసుకున్నారు. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేశారు. 

బార్డర్ దగగర హై సెక్యూరిటీ..

ఇదెలా ఉంటే టెర్రరిస్టుల కోసం భద్రతా బలగాలు తీవ్రంగా గాలిస్తున్నారు. కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వారిని గుర్తుపట్టారు. వారి ఫోటోల ఆధారంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులు ఇంకా దేశంలోనే ఉన్నారని తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో పహల్గామ్ తరహాలో మరో ఉగ్రదాడి జరగొచ్చని అంటున్నారు ఇంటెలిజెన్స్ అధికారులు. హిమాచల్ ప్రదేశ్ లో దాడులకు తెగబడే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది. హిమాచల్ ప్రదేశ్ లో హై అలెర్ట్ ప్రకటించింది. సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు పోలీసులును ఆదేశించారు. ముఖ్యంగా జమ్ము, కాశ్మీర్ బార్డర్ ను పంచుకునే హిమాచల్ ప్రదేశ్ లోని చంబా, కంగ్రా జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. కాశ్మీర్ నుంచి పారిపోయిన ఉగ్రవాదులు హిమాచల్ ప్రదేశ్ వైపు రావొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. 

pahalgam terrorist attack | today-latest-news-in-telugu | himachal-pradesh | high-alert

Also Read: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన్

Advertisment
Advertisment
Advertisment