Anam Vivekananda Reddy : ఆనం వివేకానంద రెడ్డి ఇంట్లో చోరీ.. రహస్యంగా ఉంచుతున్న కుటుంబీకులు నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే దివంగత నేత ఆనం వివేకానంద రెడ్డి ఇంట్లో దొంగతనం జరిగింది. ఆయన గది తాళాలు పగలగొట్టి.. విలువైన వస్తువులను దుండగులు అపహరించారు. అయితే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఏ వస్తువులు పోయాయన్నది గోప్యంగా ఉంచుతున్నారు. By B Aravind 03 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి Nellore : నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత ఆనం వివేకానంద రెడ్డి(Anam Vivekananda Reddy) ఇంట్లో చోరీ జరిగింది. వివేకానంద రెడ్డి గది తాళాలు పగలగొట్టి.. ఆయనకు సంబంధించిన విలువైన వస్తువులను దుండగులు అపహరించారు. వాస్తవానికి ఆనం మరణాంతరం.. కుటుంబ సభ్యులు ఆయనకు సంబంధించిన వస్తువులు, దుస్తులు ఆయన గదిలోనే భద్రపరిచారు. ఆ గది తాళాలు పెద్ద కుమారుడైన ఏసీ సుబ్బారెడ్డి వద్ద ఉంటాయి. అయితే ఆయన ఊరిలో లేని సమయంలో ఈ దొంగతనం జరిగింది. Also Read : పిఠాపురంలో భారీగా ఎన్నికల సామాగ్రి పట్టివేత ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఏసీ సుబ్బారెడ్డి(AC Subba Reddy) దొంగతనం(Theft) జరిగిన విషయంపై పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం లేదు. కుటుంబ సభ్యులు ఏ వస్తువులు పోయాయి అన్న విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారని తెలుస్తోంది. ఆనం వివేకా గదిలో దొంగతనం జరగడం నెల్లూరులో చర్చనీయమవుతోంది. Also Read : టీడీపీలోకి వైసీపీ నేతలు #telugu-news #ap-news #nellore #robbery #anam-vivekananda-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి