Gadwal Bus Accident: సీసీ ఫుటేజీలో రికార్డైన దృశ్యాలు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో జోగులాంబ గద్వాల జిల్లా లో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనం కాగా , నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. By Bhavana 13 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి శుక్రవారం అర్థరాత్రి హైదరాబాద్ (Hyderabad) నుంచి చిత్తూరుకు వెళ్తున్న జగన్ ట్రావెల్స్ బస్సు (Travels Bus) బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనం అయ్యింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు ఎర్రవల్లి చౌరస్తాలోని బెటాలియన్ పెట్రోల్ బంక్ (Petrol Bunk) ఎదురుగా ప్రైవేట్ బస్సు బోల్తా పడి దగ్దమైంది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి. Your browser does not support the video tag. ప్రమాదానికి డ్రైవర్ నిద్ర మత్తే కారణం అయ్యుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 40 మంది వరకు ఉండొచ్చని అధికారులు తెలిపారు. అసలేం జరిగిందంటే.. జోగులాంబ గద్వాల జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లా ఎర్రవల్లి చౌరస్తా సమీపంలోనికి రాగానే బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. బోల్తా పడడంతోనే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అర్థరాత్రి కావడంతో బస్సులోని ప్రయాణికులందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. బస్సు బోల్తా పడిన వెంటనే ప్రయాణికులు అప్రమత్తం అయ్యారు. వెంటనే బస్సు నుంచి కిటీకిల ద్వారా బయటకు వచ్చారు. కానీ ఓ మహిళ మాత్రం బస్సులోనే చిక్కుకుపోయింది. బయటకు రాలేకపోవడంతో మంటల ధాటికి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్నవెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటల్ని ఆర్పి వేశారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రయాణికులంతా కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూర్లకు వెళ్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాదం పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also read: నిలిచిపోయిన పందెం కోడి వేలం..ఎందుకంటే! #telangana #hyderabad #kurnool #ap #bus-accident #erravalli #jagan-travels మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి