Telangana: రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి కూటమికే ఓటేయాలి..సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో ద్వారా సందేశాన్ని ఇచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే కూటమికి ఓటేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ కుట్రలకు దేశం బలౌతుందని అన్నారు.

New Update
Telangana: రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి కూటమికే ఓటేయాలి..సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: తెలంగాణ ఎంపీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి ఇండియా కూటమిని గెలిపించండి అంటూ విజ్ఞప్తి చేశారు. ఇవి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ..రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న ఎన్నికలని ఆయన అన్నారు. అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని రాశారు...కానీ బీజేఈపీ అధికారంలోకి వస్తే అది లేకుండ పోతుందని రేవంత్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అంబేద్కర్ రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఎదిగారు. కానీ రాజ్యాంగం మార్చాలని బీజేపీ కుట్ర చేస్తోంది అని మండిపడ్డారు. రిజర్వేషన్ల రహిత దేశంగా మార్చాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది. ప్రపంచ దేశాలతో పోటీ పడాల్సిన భారత్ బీజేపీ కుట్రలకు బలి అవుతోందని...అందుకే ఈసారి ప్రజలు కూటమికి ఓటు వేయాలని ఏవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

Also Read: రామ్‌చరణ్‌కు ఘనస్వాగతం పలికిన పిఠాపురం ప్రజలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

J&K Terror Attack: పహల్గాం ఉగ్రదాడి..మోడీకి ట్రంప్‌ ఫోన్‌!

జమ్మూ కశ్మీర్‌ లోని పహల్గం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత ప్రధాని మోడీతో ఫోన్‌ లో మాట్లాడారు. ఉగ్రదాడిలో బలైన వారికి సంతాపం తెలిపారు.ఉగ్ర ఘటనను ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు.

New Update
trump pehalgam

trump pehalgam

జమ్మూ కశ్మీర్‌ లోని పహల్గం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత ప్రధాని మోడీతో ఫోన్‌ లో మాట్లాడారు. ఉగ్రదాడిని ట్రంప్‌ తీవ్రంగా ఖండించారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.ప్రధాని మోడీ కి ట్రంప్‌ ఫోన్‌ చేసిన విషయాన్ని విదేశీ వ్యవహరాల శాఖ అధికార ప్రతినిధి  జైస్వాల్‌ సోషల్‌ మీడియాలో తెలియజేశారు. '' ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు.

Also Read:Pahalgam attack: మోదీకి చెప్పడానికి నువ్వు బతికుండాలి.. కాల్పుల ముందు టెర్రరిస్ట్ మాటలు (VIDEO)

ఉగ్రదాడిలో బలైన వారికి ట్రంప్‌  సంతాపం తెలియజేశారు. ఉగ్ర దాడి ఘటనను ట్రంప్‌ తీవ్రంగా ఖండించారని జైస్వాల్‌ పేర్కొన్నారు.ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని చట్టం ముందుకు తీసుకురావడానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ట్రంప్‌ అన్నారు. ఉగ్రవాద పోరులో అమెరికా, భారత్‌ ఒకరికొకరు కలిసి పోరాడతాయని ఎక్స్‌ లో రణధీర్‌ జైస్వాల్‌ తెలిపారు.

Also Read: J&K Terror Attack: 'పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు'

ట్రంప్ ఫోన్ చేసి మద్ధతుగా మాట్లాడడంతో ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని, వారి మద్దతు దారులను చట్టం ముందు నిలబెట్టడానికి భారత్‌ కృత నిశ్చయంతో ఉన్నట్లు మోడీ పేర్కొన్నారు. అంతకు ముందే ఇదే విషయమై ట్రంప్‌ తన సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. కశ్మీర్‌ ఉగ్ర ఘటన తనను కలచివేసిందని పేర్కొన్నారు,.

మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన మోడీకి, భారతప్రజలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.మరో వైపు రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లిన ప్రధాని మోడీ తన పర్యటనను కుదించుకున్నారు.

జెడ్డా నుంచి మంగళవారం రాత్రి భారత్‌కు ఆయన తిరుగుపయనమయ్యారు. అనంత్‌నాగ్‌ జిల్లాలోని మినీ స్విట్జర్లాండ్‌ గా పేర్కొందిన పెహల్గాం సమీప బైసరన్‌ లోయలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. పర్యటకులను చుట్టుముట్టి దగ్గరి నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 28 మంది చనిపోగా,వారిలో ఇద్దరు విదేశీయులను ఉన్నట్లు అధికారులు గుర్తించారు.మృతుల్లో హైదరాబాద్‌ కు చెందిన నిఘా విభాగం అధికారి మనీశ్‌ రంజన్‌ సైతం ఉన్నారు. 

Also Read: BIG BREAKING : జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడిలో 27మంది మృతి!

Also Read: J&K Terror Attack : పాపం.. హనీమూన్కు వచ్చి కట్టుకున్న భర్తను కోల్పోయింది( Video Viral)

J&K Terror Attack | Pahalgam attack | trump | modi | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు