Revanth Reddy : బేగంపోర్ట్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండైన కొత్త సీఎం.. ప్రమాణ స్వీకారానికి కౌంట్‌డౌన్! తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారానికి కౌంట్‌డౌన్ మొదలైంది. మ.1:04 గంటలకు LB స్టేడియంలోగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఢిల్లీ నుంచి ఇప్పటికే హైదరాబాద్ బెగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న రేవంత్.. అక్కడ నుంచి గచ్చిబౌలి వెళ్లారు. By Trinath 07 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి CM Revanth Lands at Begumpet Airport : తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్‌కు తొలి విజయాన్ని అందించిన ఫైర్‌బ్రాండ్ అనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy)ఈరోజు(డిసెంబర్ 7) హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1:04 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారోత్సవానికి రావాల్సిందిగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రాజకీయ, సినీ, పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పంపారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఇతర ఏఐసీసీ నాయకులను ఢిల్లీలో కలిసి ఆహ్వానించారు. అలాగే పలువురు సీఎంలు, మాజీ సీఎంలు, సినీ ప్రముఖులు, అమరుల కుటుంబాలు, తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేక ఆహ్వానాలు పంపారు. #WATCH | Telangana CM-designate Revanth Reddy arrives at Begumpet airport in Hyderabad. Revanth Reddy will take oath as the Chief Minister of Telangana, tomorrow. pic.twitter.com/28xZxti2CU — ANI (@ANI) December 6, 2023 Revanth Reddy Garu taking blessings from the mother of Deepender Singh Hooda Ji is the best visual we can see today. ❤️ pic.twitter.com/EcB7AE2Aic — Shantanu (@shaandelhite) December 6, 2023 ఇక ఢిల్లీ కాంగ్రెస్ (Congress)పెద్దల సమావేశం ముగించుకున్న ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. బెగంపేట ఎయిర్‌పోర్టులో ల్యాండైన రేవంత్‌రెడ్డి అక్కడ నుంచి గచ్చిబౌలికి వెళ్లారు. అక్కడ ఎల్లా హోటల్‌కు చేరుకున్నారు కొత్త సీఎం. ఇక తెలంగాణ కొత్త సీఎం ప్రమాణస్వీకారానికి ఎల్‌బీ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్య అతిథులు, సీఎంలు, మాజీ సీఎంలు, ఇతర ముఖ్య నేతలు, సినీ, పారిశ్రామిక ప్రముఖులు, అమరుల కుటుంబాలు, తెలంగాణ ఉద్యమకారులు కూర్చొనేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. అలాగే పెద్ద ఎత్తున ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో వారందరూ ప్రశాంతంగా వీక్షించేందుకు పెద్ద ఎత్తున బారికేట్లు ఏర్పాట్లు చేసి, పోలీసు బందోబస్తు నిర్వహించనున్నారు. బుధవారం సాయంత్రం సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఇతర శాఖల ఉన్నతాధికారులు ప్రమాణస్వీకార ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. King.. 🙏..#RevanthReddy #TelanganaCongress pic.twitter.com/R35PKk4jMX — 🦁 (@TEAM_CBN1) December 6, 2023 ఆరుగురు మంత్రులు వీరే..? అటు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం ముగిసిన వెంటనే ఆరుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలిసింది. ఢిల్లీలో అధిష్టానం నేతలతో పలుమార్లు చర్చలు జరిపిన అనంతరం రేపు ప్రమాణస్వీకారం చేయనున్న ఆరుగురు మంత్రుల పేర్లను ఫైనల్ చేసినట్లు సమాచారం. వీరిలో ఒకరు లేదా ముగ్గురు డిప్యూటీ సీఎంలుగా పదవులు స్వీకరించనున్నట్లు తెలిసింది. అనంతరం 9వ తేదీన మిగిలిన మంత్రివర్గం కొలువుదీరనుంది. వారెవరంటే.. 1. మల్లు భట్టి విక్రమార్క 2. ఉత్తమ్ కుమార్ రెడ్డి 3. ధనసరి అనసూయ (సీతక్క) 4. దుద్దిళ్ల శ్రీధర్ బాబు 5. షబ్బీర్ అలీ 6. కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి Also Read: కోహ్లీ, రోహిత్ కాదు.. ఈ ఏడాది ఎక్కువ డబ్బులు సంపాదించిన ప్లేయర్ ఇతనే! WATCH: #congress #cm-revanth-reddy #revanth-reddy #sonia-gandhi #telangana-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి