IND VS SA: ఆ ఇద్దరుని పక్కన పెట్టండి.. ఈ ఇద్దరికి ఛాన్స్ ఇవ్వండి.. రెండో టెస్టుకు సన్నీ సజెషన్‌!

దక్షిణాఫ్రికాపై రెండో టెస్టు జనవరి 3 నుంచి ప్రారంభంకానుండగా.. ఈ టెస్టుకు టీమిండియాలో పలు మార్పులు సూచించాడు లెజెండరీ క్రికెటర్‌ సునీల్ గవాస్కర్. తొలి టెస్టులో ఆడిన అశ్విన్‌, ప్రసిద్ కృష్ణ స్థానంలో జడేజా, ముఖేశ్‌ కుమార్‌ను ఆడించాలని చెప్పాడు.

New Update
IND VS SA: ఆ ఇద్దరుని పక్కన పెట్టండి.. ఈ ఇద్దరికి ఛాన్స్ ఇవ్వండి.. రెండో టెస్టుకు సన్నీ సజెషన్‌!

మొదటి టెస్టు ఘోరంగా ఓడిపోయాం. ఇన్నింగ్స్‌ తేడాతో పరాజయం మూటగట్టుకున్నాం. అది చేస్తాం.. ఇది చేస్తాం అని దక్షిణాఫ్రికా(South Africa) ఫ్లైట్ ఎక్కిన భారత్ ప్లేయర్లు టీ20, వన్డే సిరీస్‌లలో రాణించారు కానీ.. అసలుసిసలైన టెస్టు సిరీస్‌లో మాత్రం తొలి టెస్టును దారుణంగా ప్రారంభించారు. 31ఏళ్ల నుంచి దక్షిణాఫ్రికా గడ్డపై భారత్‌ ఎప్పుడూ కూడా టెస్టు సిరీస్‌ విజయం సాధించలేదు. ఈ సారైనా ఆ ఫేట్ మారుతుందని ఫ్యాన్స్‌ భావించగా.. టీమిండియా నిరాశ పరిచింది. ఇక ఆఖరిదైన రెండో టెస్టు జనవరి 3 నుంచి ప్రారంభం కానుండగా.. ఈ మ్యాచ్‌లో రెండు మార్పులు చేయాలని టీమిండియా లెజెండరీ క్రికెటర్‌ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) సూచించారు.

జడేజాను తీసుకురావాలి:
దక్షిణాఫ్రికా పిచ్‌లు సాధారణంగా పేసర్లకు అనుకూలిస్తాయి. సెంచూరియన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ నలుగురు పేసర్లు ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగింది. టెస్టుల్లో నంబర్‌-1 బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌(Ravichandran Ashwin)ని ఆడించింది. అతను పర్వాలేదనిపించాడు. అయితే అశ్విన్‌ స్థానంలో రవీంద్ర జడేజా(Ravindra Jadeja)ను ఆడించాలని సునీల్ గవాస్కర్‌ చెబుతున్నాడు. అంతే కాదు ఫార్మెట్‌తో సంబంధం లేదకుండా భారీగా పరుగులు సమర్పించుకుంటున్న పేసర్ ప్రసిద్ కృష్ణను తప్పించాలంటున్నాడు. అతని స్థానంలో ముఖేశ్‌కు తుది జట్టులో అవకాశం ఇవ్వాలని చెబుతున్నాడు. నిజానికి జడేజా గాయంతో బాధపడుతున్నాడు. మొదటి టెస్టు ప్రారంభానికి ముందు వెన్నుముకపై నొప్పితో బాధపడుతూ ఆ మ్యాచ్‌కు దూరమయ్యాడు.

అటు సన్నీ వ్యాఖ్యలతో మాజీ పేసర్‌ ఇర్ఫాన్ పఠాన్‌ ఏకీభవించాడు. ముఖేశ్‌ కుమార్ వెస్టిండీస్‌పై వెస్టిండీస్‌తో ఒకే ఒక టెస్టు ఆడాడు. అక్కడ పిచ్‌పై అతను రెండు వికెట్లు పడగొట్టాడు.40 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 151 వికెట్లను కలిగి ఉన్నాడు. ఇందులో ఆరు ఫైఫర్‌లు ఉన్నాయి. 30 ఏళ్ల ముఖేశ్‌ దక్షిణాఫ్రికాలో జరిగిన రెండు టీ20లలో మూడు వికెట్లు తీశాడు. మూడు వన్డేల్లో ఒక వికెట్ మాత్రమే తీశాడు. ఇక సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో టీమ్ ఇండియాపై ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో విజయం సాధించిన ప్రోటీస్ ప్రస్తుతం రెండు మ్యాచ్‌ల రెడ్-బాల్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది.

Also Read: నీళ్లు తాగుతూ కుప్పకూలిన క్రికెటర్‌.. చిన్నవయసులోనే ఊహించని మరణం!

WATCH:

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Trump: కేవలం 30 రోజులే..అమెరికాను విడిచి వెళ్లిపోండి...!

అమెరికా మరోసారి విదేశీ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. సమయానికి మించి యూఎస్‌లో ఉంటున్న వారిని తక్షణమే దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించింది.30 రోజులకు మించి నివసిస్తున్న వారు కచ్చితంగా ఫెడరల్ గవర్నమెంట్ వద్ద రిజిస్టర్ చేసుకోవాలంది.

New Update
Trump

Trump

ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలుచేపట్టినప్పటి నుంచి అమెరికా వలసదారులపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అక్రమంగా అమెరికాకు వచ్చిన వారిని వెంటాడి, వేటాడి, వేధించైనా అమెరికా నుంచి బయటకు పంపిస్తున్నారు. అక్రమంగా వచ్చిన వారు, టూరిస్టు వీసాలపై వచ్చి దొంగచాటున అక్కడే ఉన్న వారు, చదువుకోవడానికి వచ్చి అక్రమంగా తలదాచుకుంటున్న వారిని పట్టుకుని మరీ బలవంతంగా వారి దేశాలకు పంపిస్తున్నారు. 

Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

అమెరికాలో ఎక్కువకాలం నివసించే విదేశీ జాతీయులు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలని ఇదివరకే హెచ్చరికలు జారీ చేసిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ.. తాజాగా మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.అమెరికాలో 30 రోజులకు మించి నివసిస్తున్న వారు కచ్చితంగా ఫెడరల్ గవర్న్‌మెంట్ వద్ద రిజిస్టర్ చేయించుకోవాలని, ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే.. నేరం కింద పరిగణించి జరిమానాలు, జైలు శిక్షలు విధిస్తామని ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఎవరికి వారు సొంతంగా అమెరికా విడిచి వెళ్లిపోవాలని అధికారికంగా  తెలిపింది. 

Also Read:  Tv Offers: వారెవ్వా ఆఫర్లు కుమ్మేశాయ్.. 40 ఇంచుల స్మార్ట్‌టీవీలు కేవలం రూ.15వేల లోపే!

సొంతంగా అమెరికాను వీడటమే ఉత్తమమైన మార్గమని, ఎటువంటి నేర నేపథ్యం లేకపోతే అమెరికాలో సంపాదించుకున్న సొమ్మును దాచుకుని.. సామాను సర్దుకుని బయల్దేరి విమానం ఎక్కండి అంటూ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ వెల్లడించింది. ఇలాంటి వారిలో విమాన టికెట్ సొమ్మును భరించలేని వారు ఉంటే.. వారికి టికెట్ సొమ్ములో రాయితీ ఇచ్చేందుకు సైతం ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వివరించారు.

30 రోజులకు మించి అమెరికాలో ఉన్న వారు రిజిస్టర్ చేసుకోవాలన్న నిబంధనలు పాటించకపోతే తక్షణమే దేశం నుంచి వెళ్లగొడతామని తేల్చి చెప్పింది. దాంతో పాటు ఫైనల్ ఆర్డర్ అందుకున్న వారు ఒక్క రోజు అధికంగా దేశం ఉన్నా.. రోజుకు రూ.86 వేలు  జరిమానా కట్టాల్సి ఉంటుందని వివరించింది. సొంతంగా దేశం వీడకపోతే గరిష్ఠంగా రూ.4.30 లక్షలు ఫైన్ వేయనున్నట్లు మరోసారి గుర్తు చేసింది. 

జరిమానాతో పాటు జైలు శిక్షను కూడా విధించే అవకాశం ఉందని వివరించింది. జరిమానా కట్టే వారు, జైలు శిక్ష అనుభవించిన వారు భవిష్యత్తులో చట్టపరమైన మార్గంలో కూడా అమెరికాలోకి ప్రవేశించే అవకాశాన్ని కోల్పోతారని వెల్లడించింది.హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తాజా నిబంధనలు హెచ్‌1బీ, విద్యార్థి పర్మిట్లపై ఉండే వారికి వర్తించబోవు. అయితే సరైన అనుమతులు లేకుండా అమెరికాలో ఉండిపోయే వారిపై మాత్రం దీనిని కచ్చితంగా అమలు చేయనున్నారు. 

Also Read: Vijay: వక్ఫ్ సవరణ చట్టంపై హిరో విజయ్ సంచలన నిర్ణయం

Also Read: Group 1: గ్రూప్-1 అవకతవకలపై పోరాటం చేస్తాం.. TGPSCపై కేసు వేస్తా: రాకేశ్ రెడ్డి

trump | america | foreign | visa | America F1 Visa | america-students-visa | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment