/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-3-10.jpg)
Pawan kalyan: ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించినప్పటినుంచి రేణూ దేశాయ్, పవన్ లకు సంబంధించిన రిలేషన్ ఇష్యూ మరింత హాట్ టాపిక్ గా మారింది. పవన్ విజయం సాధించినందుకు శుభాకాంక్షలు చెప్పిన రేణూ.. పవన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన అకీరా, ఆద్య ఫొటోను నెట్టింట షేర్ చేసింది. అంతటితో ఆగకుండా 'నా పిల్లలు వాళ్ల నాన్న బిగ్గెస్ట్ డే రోజు ఇలా రెడీ అయ్యారు. కళ్యాణ్ గారికి కంగ్రాట్స్. ఏపీ స్టేట్ ప్రజలకు మంచి చేయాలని కోరుతున్నా' అంటూ పోస్టులో రాసుకొచ్చింది.
ఈ క్రమంలోనే తాజాగా పవన్ ఏపీలో మంత్రి అయిన సందర్భంగా సుధాకర్ అనే పవన్ అభిమాని రేణూను ట్యాగ్ చేస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. 'మీరు కొన్ని రోజులు ఓపిక పట్టి ఉంటే బాగుండేది. ఒక దేవుడిని పెళ్లి చేసుకుని ఆయన అంతరంగం తెలీకుండా వెళ్లిపోయారు. కానీ ఈరోజు అయినా మీకు పవన్ విలువ తెలిసింది. ఏది ఏమైనా విధి ప్రతిదీ నిర్ణయిస్తుంది. ఈరోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు. అది చాలు వదిన. మిమ్మల్ని మిస్ అవుతున్నాం' అంటూ రాసుకొచ్చాడు. అయితే దీనిపై స్పందించిన రేణూ.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. 'మీకు కొంచెమైనా బుద్ధి ఉంటే ఇలా చెప్పరు. ఆయన వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు. నేను కాదు. ఇలాంటి కామెంట్స్ పెట్టి దయచేసి నన్ను టార్చర్ చేయకండి' అని కోరింది.
Certain beautiful Photographs have to be shared,they can't just say in the Photo album of your phone... Some rare moments captured by me on my phone camera 😁😍 pic.twitter.com/rD6jp0bxs4
— RenuDesai (@iam_RenuDesai) December 2, 2020