Tattoos: 15 రోజుల్లోగా టాటూలు తొలగించాలి.. పోలీస్‌ శాఖ కీలక ఆదేశం

పోలీసులు యునిఫాం బయట కనిపించే టాటూలను15 రోజుల్లోగా తొలగించాలని ఒడిశాలోని పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా ఈ ఆదేశాలు పాటించడంలో విఫలమైతే.. వాళ్లపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

New Update
Tattoos: 15 రోజుల్లోగా టాటూలు తొలగించాలి.. పోలీస్‌ శాఖ కీలక ఆదేశం

Tattoos Not Allowed - Odisha Police: కొంతమందికి టాటూలు అంటే చాలాపిచ్చి ఉంటుంది. ఒక్కసారి వీటికి అలవాటు పడితే.. తమ బాడికి అలా వివిధ రకాల టాటూలు వేయించుకుంటూనే ఉంటారు. అయితే ఒడిశాలోని పోలీస్ శాఖ వీటికి సంబంధించి ఓ కీలక ప్రకటన చేసింది. పోలీసుల శరీరంపై కూడా టాటూలు ఉండటం అవమానకరమని పేర్కొంది. యూనిఫాం బయట కనిపించే పచ్చబొట్లను 15 రోజుల్లో తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. పోలీస్‌ ఉద్యోగుల్లో మర్యాద, సమగ్రతను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఇందుకు సంబంధించి పోలీస్‌ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది.

Also Read: ఐఫోన్లలో స్పైవేర్..92 దేశాల్లో యూజర్లకు ముప్పు

భువనేశ్వర్, కటక్‌ పరిధిలో ఉన్న జంట నగరాల కమిషనరేట్లకు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్‌ ఈ లేఖ పంపించింది. రాష్ట్రంలో చాలామంది పోలీస్‌ సిబ్బంది శరీరాలపై టాటూలు ఉన్నాయని లేఖలో తెలిపింది. ఇలా శరీరంపై టాటూలు ఉండటం.. ఒడిశా పోలీసులు, బెటాలియన్‌ ప్రతిష్టను దిగజార్చుతోందని పేర్కొంది. పచ్చబొట్ల వల్ల సిబ్బంది అభ్యంతకరంగా కనిపిస్తున్నారని.. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాతే టాటూలు తొలగించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. యూనిఫాం ధరించినప్పుడు శరీరంపై కనబడే టాటూలు ఉండటాన్ని అనుమచించమని లేఖలో పేర్కొంది.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా శరీరంపై టాటూలు ఉన్న పోలీసుల జాబితాలను సిద్ధం చేయాలని.. 15 రోజుల్లోగా ఈ ఆదేశాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఒడిశా పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా ఈ ఆదేశాలు పాటించడంలో విఫలమైతే.. వాళ్లపై శాఖపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించింది. ముఖం, మెడ, చేతులు వంటి కనిపించే శరీర భాగాలపై టాటూలు వేయించుకోవద్దని సూచనలు చేసింది.

Also Read: ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన సీబీఐ

Advertisment
Advertisment
తాజా కథనాలు