india-canada: భారత్ తో సంబంధం మాకు చాలా ముఖ్యమైనది-కెనడా రక్షణ మంత్రి

భారత్- కెనడాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజు పెరుగుతున్నాయి. ఖలిస్తాన్ వివాదం రెండు దేశాల మధ్య మంటలను పెంచుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కెనడా రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారత్ తో బంధం తమకెంతో ముఖ్యమైనదన్నారు బ్లెయిర్. అయినా కూడా నిజ్జర్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు.

New Update
india-canada: భారత్ తో సంబంధం మాకు చాలా ముఖ్యమైనది-కెనడా రక్షణ మంత్రి

భారత్ తో రక్షణ సంబంధాలు తమ దేశానికి ఎంతో ముఖ్యమంటున్నారు కెనడా రక్షణ శాఖా మంత్రి బిల్ బ్లెయిర్. ది వెస్ట బ్లాక్ అనే ప్రతికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేశారు. కానీ ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో దర్యాప్త మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఒకవేళ భారత్ విషయంలో మేము చేసిన ఆరోపణలు కనుక నిజమని రుజువైతే మాత్రం ఇదొక సవాల్ తో కూడుకున్న సమస్యగా మారుతుందని చెప్పారు. అది తెలిసినా కూడా మా పౌరులను, చట్టాలను రక్షించుకోవడం మా బాధ్యత అని బ్లెయిర్ అన్నారు. అందుకే నిజ్జర్ హత్య కేసులో పూర్తిగా దర్యాప్తు జరిపి నిజాన్ని బయటపెట్టాల్సిన బాధ్యత మా మీద ఉందని తెలిపారు.

మా గడ్డపై మా పౌరుని హత్య చేయడం మా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే అన్నారు బిల్ బ్లెయిర్. ఇండో పసిఫిక్ వ్యహానికి కెనడా ఇప్పటికీ ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మరోవైపు నిజ్జర్ హత్య తరువాత ఆ నిఘా సమాచారాన్ని కెనడాకు అగ్రరాజ్యం అమెరికానే అందజేసిందని న్యూ యార్క్ టైమ్స్ అంటోంది. దాన్ని ఆధారంగా చేసుకునే కెనడా ప్రభుత్వం భారత్ మీద ఆరోపణలను చేస్తోందని అందులో కథనంగా వచ్చింది. తమదేశంలోని భారత దౌత్యాధికారుల సంభాషణలను దొంగచాటుగా వినడం ద్వారా కెనడా విభాగాలు కూడా ఈ విషయాన్ని నిర్ధారించుకున్నాయని తెలుస్తోంది.

ఇక నిజ్జర్ హత్య మీద కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో చేసిన వ్యాఖ్యలకు భారత విదేశాంగ్ మంత్రి ఎన్ . జైశంకర్ మరోసారి గట్టిగా బదులిచ్చారు. ప్రస్తుతం న్యూయార్క్ లో ఉన్న ఆయన ట్రూడో మీద పరోక్షంగా విమర్శలు చేశారు. స్వేచ్ఛ పేరుతో, మార్కెట్ పేరుతో చాలా పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. మరోవైపు కెనడాతో పాటూ ఇతర దేశాల్లో ఉన్న ఆ దేశపౌరుల ఓసీఐ కార్డులను రద్దు చేయాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. దీని వల్ల ఆ దేశపౌరులు ఇక భారతదేశంలో అడుగుపెట్టేందుకు వీలు ఉండదు.

ఇది కూడా చదవండి: నష్టాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..

అగ్రరాజ్యం ఎట్టకేలకు వెనక్కు తగ్గింది. టారీఫ్ లకు సంబంధించి ట్రంప్ సర్కార్ ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. చైనా మినహా మిగతా అన్ని దేశాలపైనా టారీఫ్ లను 90 రోజుల పాటూ నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

New Update
Donald Trump

Donald Trump

మొత్తానికి అమరికా ప్రభుత్వం దిగొచ్చింది. టారీఫ్ లపై ఇంచుమించు అన్ని దేశాలూ వ్యతిరేకత వ్యక్తం చేస్తుండడంతో వెనక్కు తగ్గడమే మంచిది అనుకున్నట్టుంది. మొత్తానికి టారీఫ్ లపై కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఊరట కలిగించింది. దాదాపు వార రోజుల పాటూ ట్రంప్ టారీఫ్ లతో బెంబేలెత్తిపోయిన ప్రపంచం ఇప్పుడు కాస్త శాంతిస్తుంది. అమెరికా అధ్యక్షుడు మొదలెట్టిన ఈ వాణిజ్య యుద్ధంతో ప్రపంచ మార్కెట్ అంతా అతలాకుతలం అయిపోయింది. షేర్ మార్కెట్ అయితే ఎన్నడూ చూడని విధంగా నష్టాలను చూసింది.  ఇప్పుడు ఈ 90 రోజుల నిలుపుదలతో అందరూ కాస్త ఊరట చెందుతారు.

చైనాకు మాత్రం లేదు..

అయితే ఈ 90 రోజుల నిలుపుదల చైనాకు మాత్రం వర్తించదని ట్రంప్ సర్కార్ ప్రకటించింది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య మరింత ముదిరినట్టయింది.  ఇప్పటికే చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనాపై యూఎస్ సుకాలు పెంచుకుంటూ పోతోంది. తాజాగా ఒక్కరోజు తేడాలోనే చైనాపై యూఎస్‌ మరోసారి సుంకాలు పెంచింది. 104 నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. చైనా కూడ తగ్గేదే లే అన్నట్టు ప్రవర్తిస్తోంది. అంతకుముందు అమెరికాకు ప్రతిగా ఆ దేశం కూడా అమెరికా వస్తువులపై 84 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మరోసారి డ్రాగన్‌పై సుంకాలు 125శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. 

today-latest-news-in-telugu | usa | donald trump tariffs

Also Read: GT VS RR: గుజరాత్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం

Advertisment
Advertisment
Advertisment