Viral Video : గాల్లో తేలుతున్న అమ్మాయి.. పూణెలో వీడియో వైరల్

టీనేజ్ అమ్మాయి గాల్లో తేలుతున్న వీడియో ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. పూణెలో ఒక స్కూల్లో రికార్డ్ చేసిన వీడియో ఇది. విద్యార్ధికి దెయ్యం పట్టడం వల్లనే అలా గాల్లో తేలుతోంది అంటూ వీడియోకు సంబంధించి ప్రచారం జరుగుతోంది.

New Update
Viral Video : గాల్లో తేలుతున్న అమ్మాయి.. పూణెలో వీడియో వైరల్

Pune : మహారాష్ట్ర(Maharashtra) లోని పూణె సిటీలో గాల్లో తేలుతున్న విద్యార్ధి వీడియో బాగా తిరుగుతోంది. రెడ్డిట్(Reddit) అనే సోషల్ మీడియా(Social Media) ఫ్లాట్ ఫామ్‌లో దీనిని షేర్ చేశారు. స్కూల్లో తీసిని ఈ వీడియోలో ఒక అమ్మాయి గాల్లో వేలాడుతోంది. ఆ అమ్మాయికి దెయ్యం పట్టిందని అందుకే అలా గాల్లోకి ఎగిరిందని యూజర్ అందులో రాశారు. ఈరోజు నా స్కూల్లో నా ఫ్రెండ్ ఇలా ఉంది అంటూ వీడియోను షేర్ చేశారు. మొత్తం ౩౦ సెకన్ల వీడియో ఇది.

ఈ వీడియోలో అమ్మాయి క్లాసు రూములోనే పిచ్చిగా ప్రవర్తిస్తోంది. అరుస్తూ.. కొట్టేసుకుంటూ పిచ్చిగా ప్రవర్తిస్తోంది. ఆ అమ్మాయిని అదుపులో ఉంచేందుకు క్లాసులో టీచర్‌తో పాటూ మిగతా విద్యార్ధులు(Students) ప్రయత్నిస్తుండడం వీడియోలో కనిపిస్తోంది. సడెన్‌గా క్లాసు జరుగుతున్న మధ్యలో ఇది జరిగినట్టు తెలుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

India: పాకిస్తానీయులకు ముగిసిన డెడ్ లైన్..537 మంది వెనక్కు..

టెంపరరీ వీసాలతో భారత్ కు వచ్చిన పాక్ పౌరులకు భారత ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ రోజు తో ముగిసింది. దీంతో ఇప్పటి వరకు 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు వెళ్ళారని తెలుస్తోంది. వీరిలో తొమ్మది మంది దౌత్య వేత్తలు, అధికారులు ఉన్నారు.

New Update
pak

Pakistan People

పాకిస్తానీయులు ఇండియాలో ఉండటంపై భారత ప్రభుత్వం సీరియస్ గా ఉంది. పహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత పాక్ పౌరులు తమ దేశం నుంచి వెళ్ళిపోవాలని ఆదేశాలను జారీ చేసింది. ఏప్రిల్ 24న ఈ ఉత్తర్వులను ఇచ్చింది. దీంతో పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్ళడం ప్రారంభించారు. ఇప్పటివరకు నాలుగు రోజుల్లో 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు  వెళ్లిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒక్క ఆదివారం రోజునే 287 మంది వెళ్ళారని సమాచారం . ఇందులో తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు ఉన్నట్లు చెప్పారు. కొంతమంది ఫ్లైట్స్ ద్వారా వెళ్ళారని..అయితే నేరుగా పాక్ కు విమాన సర్వీసులు లేవు కాబట్టి..ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉండవచ్చని చెప్పారు. ఇదే సరిహద్దు ద్వారా 850 మంది భారతీయులు పాకిస్థాన్‌ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు చెప్పారు.

మూడు లక్ష జరిమానా..

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌లో ఉంటున్న పాకిస్థానీయులను నిర్ణీత గడువులోగా వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా గడువు దాటినా కూడా ఇంకా భారత్‌లోనే ఉంటే చట్టం ప్రకారం వాళ్లని అరెస్టు చేయవచ్చు. దీనిపై దర్యాప్తు చేపట్టి.. మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా, లేదా రెండు విధించే ఛాన్స్ కూడా ఉంటుంది.  సార్క్‌ వీసాల కింద ఇండియాలో ఉంటున్న పాకిస్థానీయులు ఏప్రిల్ 26లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే మెడికల్ వీసాల కింద వచ్చినవాళ్లకు మాత్రం ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చింది. స్టూడెంట్, బిజినెస్, విజిటర్ తదితర 12 విభాగాల్లో వీసాలు ఉన్నవాళ్లు మాత్రం ఏప్రిల్ 27 నాటికి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఏప్రిల్ 4 నుంచి ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్‌ యాక్ట్‌-2025 అమల్లోకి వచ్చింది. 

 today-latest-news-in-telugu | india | pakistan 


Also Read: Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

Advertisment
Advertisment
Advertisment