IPL 2024 : మొత్తానికి గెలిచిన ఆర్సీబీ..ఆరు ఓటముల తర్వాత విజయం అందరూ హైదరాబాద్ సన్‌రైజర్స్ టీమే గెలుస్తుంది అనుకున్నారు. మళ్ళీ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆ జట్టు రికార్డ్‌లు సృష్టిస్తుందని కూడా భావించారు. కానీ అనూహ్యంగా ఆర్సీబీ నిన్నటి మ్యాచ్‌లో విజయం సాధించింది. ఆరు ఓటముల తర్వాత గెలిచింది. By Manogna alamuru 26 Apr 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి RCB VS SRH : ఆర్సీబీ పని అయిపోయింది. నాకౌట్ దశ నుంచే వెనుదిరుగుతుంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో గెలిచి తాము ఇంకా ఉన్నామంటూ నిరూపించుకుంది ఆర్సీబీ. నిన్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం(Hyderabad Uppal Stadium) లో హైదరాబాద్ సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో గెలిచింది బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు. బౌలర్లు క్రమశిక్షణతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సన్ రైజర్స్ ఓడిపోక తప్పలేదు. రికార్డు స్కోర్లు, వరుస విజయాలతో దూసుకెళ్తున్న సన్‌రైజర్స్ జోరుకు సొంత గ్రౌండ్ మీద బ్రేకులు పడ్డాయి. బ్యాటర్లు విఫలమవడంతో ఆ జట్టు మూడో ఓటమిని ఖాతాలో వేసుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 206 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ సన్‌రైజర్స్‌కు ఇచ్చింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) (51; 43 బంతుల్లో 4×4, 1×6) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రజత్ పటీదార్ (50; 20 బంతుల్లో 2×4, 5×6) మెరుపులు తోడవడంతో భారీ స్కోరు నమోదైంది. దీని తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ఆడిన హైదరాబాద్ బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులకే పరిమితమైంది. నిజానికి ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇదేమంత పెద్ద స్కోరు కాదు. కానీ కానీ పిచ్ సహకరించనప్పుడు.. పరిస్థితులు అనుకూలించనప్పుడు చిన్న స్కోర్లు కూడా ఛేదించడం కష్టమే అవుతుంది. దీనికి నిదర్శనమే నిన్నటి హైదరాబాద్ పరిప్థితి. ఆరంభం నుంచే తడబడిన హైదరాబాద్.. బ్యాటింగ్‌కు దిగిన మొదటి నుంచి సన్‌రైజర్స్ బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. మొదటి ఓవర్లోనే ట్రావిడ్ హెడ్(Travis Head) వికెట్ కోల్పోయాడు. ఇది బెంగళూరుకు కలిసిరాగా...హైదరాబాద్‌కు బలాన్ని తగ్గించింది. తరువాత వచ్చిన బ్యాటర్లు ఆడడానికి ప్రయత్నించినప్పటికీ పెద్దగా ఫలితాలు రాలేదు. ఎవ్వరూ పెద్దగా స్కోర్లు చేయలేకపోయారు. 85 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిపోయింది. తరువాత వచ్చిన వారు కూడా పెద్దగా ఆడలేకపోయారు. దీంతో హైదరాబాద్ సన్‌రైజర్స్ టీమ్ 171 పరుగులకే ఆలౌట్ అయిపోయి ఆర్సీబీకి మ్యాచ్‌ను సమర్పించుకుంది. షాబాజ్ అహ్మద్ (40 నాటౌట్; 37 బంతుల్లో 1×4, 1×6) చివరి బంతి వరకు క్రీజులో ఉన్నా అద్భుతాలేమీ చేయలేకపోయాడు. టాస్ గెలచి బ్యాటింగ్.. ఇక బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విషయానికి వస్తే టాస్ గెలవడంతోనే ఆ జట్టు సగం విజయాన్ని సాధించినట్టు అయింది. హైదరాబాద్ బ్యాటర్లను, పిచ్‌ను దృష్టిలో పెట్టుకుని టాస్ గెలవగానే సన్‌రైజర్స్‌కు బ్యాటింగ్ ఇవ్వకుండా, తనే మొదట బ్యాటింగ్ చేసింది బెంగళూరు. ఆరంభంలో ఆ జట్టు చాలా దూకుడుగా ఆడింది. మొదటి బంతినే కోహ్లి బౌండరీగా మలిచాడు. రెండో ఓవర్లో కెప్టెన్ డుప్లెసిస్ (25; 12 బంతుల్లో 3×4, 1×6) మూడు ఫోర్లతో చెలరేగాడు. తర్వాత డుప్లెసిస్ అవుట్ అయిపోయినా కోహ్లీ నెమ్మదిగా ఆడుతూ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్ళాడు. ఇక రెండు వికెట్లు పడిత తర్వాత వచ్చిన రజిత్ పసటీదార్ అయితే చెలరేగిపోయాడు. ఒక ఎండ్‌లో కోహ్లి భారీ షాట్లు కొట్టేందుకు ఇబ్బంది పడుతుండటంతో పటీదార్ బాధ్యత తీసుకున్నాడు. మార్కండే వేసిన 11వ ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లతో చెలరేగి 27 పరుగులు పిండుకున్నాడు. రజత్ కేవలం 19 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. ఆర్సీబీ స్కోరు 200 దాటడానికి కారణంగా నిలిచాడు. తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎవరూ పెద్దగా స్కోర్లు చేయలేకపోయినప్పటికీ టోటల్‌గా భారీ స్కోరునే లక్ష్యంగా హైదరాబాద్‌కు ఇవ్వగలిగారు. చివరి 5 ఓవర్లలో ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి 64 పరుగులు సాధించింది. Also Read: Tech Mahindra: టెక్ మహీంద్రా లాభాల్లో 40 శాతం క్షీణత..అయినా 6వేల ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ #cricket #rcb #ipl-2024 #srh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి