Telangana Elections 2023:పోలింగ్ రోజున ఓటర్లకు ర్యాపిడో ఉచిత సేవలు

మరో రెండు రోజుల్లో తెలంగాణ ఎలక్షన్ పోలింగ్ జరుగుతోంది. తెలంగాణ అంతా హడావుడిగా ఉంది. దీనికి ర్యాపిడో కూడా తమ వంతు సహకారం అందిస్తోంది. పోలింగ్ న ర్యాపిడో ఉచిత సేవలందిస్తుందని చెప్పింది.

New Update
ర్యాపిడోలో ఫ్రీగా పోలింగ్ కేంద్రాలకు..

తెలంగాణ ఎన్నికల ప్రచారం, సభలు చాలా హడావుడిగా ఉంది. ఈరోజుతో ప్రచారం ముగిసిపోతోంది. మరో రెండు రోజుల్లో పోలింగ్ కూడా జరుగనుంది. పోలింగ్ వందశాతం జరగడానికి ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దాంతో పాటూ ప్రవైటు సంస్థలు కూడా ఓటింగ్ బాగా జరిగేందుకు సహకరిస్తామని ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో నవంబర్ 30న జరగనున్న ఎన్నికలకు ఓటర్లను తరలించేందుకు ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పించనున్నట్లు రాపిడో సంస్థ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. నగరంలోని 26 పోలింగ్‌స్టేషన్‌లకు రాపిడో సేవలు లభించనున్నాయి. దీని కోసం ఓటర్లు తమ మొబైల్‌ ఫోన్‌ రాపిడో యాప్‌లో ‘ఓట్‌ నౌ’ కోడ్‌ను నమోదు చేసుకోవాలి. అలా చేసుకున్న వాళ్ళు ఫ్రీగా ర్యాపిడో బుక్ చేసుకోవచ్చును. ఎంత దూరం అయినా హాయిగా వెళ్ళి ఓటు వేసి రావచ్చును. ప్రతి ఒక్కరూ ఓటుహక్కును సద్వినియోగం చేసుకొనేలా ఈ సర్వీసులను అందుబాటులో ఉంచనున్నట్లు రాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్‌ గుంటుపల్లి తెలిపారు.

హైదరాబాద్ లో మొత్తం 2,600 పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను ఉచితంగా చేరవేస్తామని రాపిడో కంపెనీ తెలిపింది. పోలింగ్‌ కేంద్రాలు, ప్రయాణ ఖర్చుల కారణంగా కొంత మంది తమ ఓటు హక్కును వినియోగించుకోకపోవచ్చనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనను ప్రకటించినట్లు రాపిడో చెబుతోంది. నగరంలో ఎక్కడి నుంచైనా తమ పోలింగ్ బూత్ కు ఉచితంగా వెళ్లేందుకు తమ సంస్థ సహాయం చేస్తుందన్నారు. ఈ ఉచితం ఆఫర్ ముఖ్యంగా యువ ఓటర్లను పోలింగ్ స్టేషన్‌లకు తరలించడంలో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రజాస్వామ్యం భారతదేశానికి ఆభరణమని.. ఆ ప్రజాస్వామ్యం ఇచ్చిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పవన్ పిలుపునిచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Canada: కెనడాలో ఊహించని పరిణామం.. పార్లమెంట్‌కు తాళాలు

కెనడా పార్లమెంటు భవనాన్ని ఒట్టావా పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. శనివారం ఆ భవనంలోకి ఓ గుర్తు తెలియని దుండగుడు ప్రవేశించాడని అందుకే మూసివేసినట్లు పోలీసులు చెప్పారు. ఆదివారం ఉదయం అతడిని అందుబాటులోకి తీసుకుని దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Canada parliament briefly put on lockdown

Canada parliament briefly put on lockdown

కెనడాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అక్కడి పార్లమెంటు భవనాన్ని ఒట్టావా పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. శనివారం ఆ భవనంలోకి ఓ గుర్తు తెలియని దుండగుడు ప్రవేశించాడని అందుకే మూసివేసినట్లు పోలీసులు చెప్పారు. పార్లమెంట్‌ హిల్‌లోని తూర్పు బ్లాక్‌లోకి అక్రమంగా వచ్చిన దుండగులు రాత్రంతా లోపలే ఉన్నాడని తెలిపారు. అతడి దగ్గర ఆయుధాలు ఉన్నాయా ? లేదా ? అనేదానిపై స్పష్టత లేదు.  ఇక వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి పార్లమెంటు భవనంలోకి చొరబడచంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. 

Also Read: పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మోదీ.. భారత్‌లో ఇలాంటి వంతెన ఇదే ఫస్ట్ టైం

పార్లమెంటు భవనం చుట్టూ పోలీసులను మోహరించారు. తూర్పు బ్లాక్‌లో ఉన్న సిబ్బంది అందరూ ఒకే గదిలోకి వచ్చి తాళాలు వేసుకోవాలని సూచించారు. భవనంలో ఉన్న పలు ప్రదేశాలపై కూడా లాక్‌డౌన్ పెట్టారు. అలాగే పార్లమెంటుకు దగ్గర్లో ఉన్న రోడ్లని మూసివేస్తున్నామని.. ప్రజలు ఎవరూ కూడా అటువైపు రావొద్దని అధికారులు ఆదేశించారు. చివరికీ ఆదివారం ఉదయం దుండగుడిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నట్లు చెప్పారు. 

ఏప్రిల్ 28న కెనడాలో ముందస్తు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ గత నెల 23వ తేదీన పార్లమెంటును రద్దు చేశారు. వాస్తవానికి అక్కడ అక్టోబర్ 27న ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ దాదాపు ఆరు నెలలకు మందుగానే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్లమెంటులోకి దుండగుడు ప్రవేశించడం కలకలం రేపుతోంది. అందులో ఉండే సున్నితమైన సమాచారాన్ని ఎత్తుకెళ్లడం కోసం దుండగులు వచ్చాడా ? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. 

Also Read: అమ్మో బాబోయ్.. చీతాలకు నీళ్లు తాగించిన యువకుడు.. చివరికీ ఊహించని షాక్

telugu-news | canada | rtv-news 

 

Advertisment
Advertisment
Advertisment