SS Rajamouli : ఆంటీ తిట్టిందని.. 360 ఎకరాల భూమి అమ్మేసిన రాజమౌళి ఫ్యామిలీ! స్టార్ డైరెక్టర్ రాజమౌళి తన ఫ్యామిలీ కష్టాల గురించి చెప్పిన వీడియో వైరల్ అవుతోంది. 'కర్ణాటకలో 360 ఎకరాల భూమి ఉండేది. చాలా రిచ్ గా బతికేవాళ్లం. అనుకోని పరిస్థితుల్లో మొత్తం అమ్మేసి చెన్నైలో సింగిల్ బెడ్ రూమ్ లో 13 మందిమి ఉన్నాం' అంటూ చెప్పుకొచ్చాడు. By srinivas 17 Apr 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి SS Rajamouli: దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళికి కుటుంబానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. భిన్నమైన కథలతో సినిమాలు తెరకెక్కిస్తూ ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాందించుకున్న ఆయన.. ఇటీవలే 'ఆర్ఆర్ఆర్'తో (RRR Movie) తెలుగు సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లి ఔరా అనిపించాడు. అయితే ఆయన ఇప్పటివరకూ తీసిన సినిమాలన్నింటిలో ఒకటి, రెండు తప్పా మిగతావన్నీ భారీ బడ్జెట్ తో కూడినవే. అయితే వందల కోట్లు ఖర్చు చేసి సినిమాలు తీసే రాజమౌళీ.. ఒకానొక సమయంలో తమకున్న 360 ఎకరాల భూమిని అమ్మేశారట. View this post on Instagram A post shared by TEAM SS RAJAMOULI (@teamssrajamouli) ఇది కూడా చదవండి: HariHaraVeeraMallu: ధర్మం కోసం యుద్ధం.. పవన్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్! సింగిల్ బెడ్ రూమ్ ఇంట్లో 13 మంది.. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళినే చెప్పడం విశేషం. కాగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 'నేను పదేళ్ల వయసున్నప్పుడు మా కుటుంబానికి కర్ణాటకలో 360 ఎకరాల భూమి ఉండేది. చాలా రిచ్ గా బతికేవాళ్లం. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆ మొత్తాన్ని అమ్మేసి చెన్నై వెళ్ళిపోవాల్సి వచ్చింది. అక్కడ సింగిల్ బెడ్ రూమ్ ఇంట్లో 13 మంది ఉన్నాం. పెద్దన్న ఒక్కడు పని చేసి కుటుంబ సభ్యుల కడుపు నింపేవాడు. నాకు 21ఏళ్లు వచ్చేసరికి పెద్దన్నకు పెళ్లి అయి ఇంటికి వదిన వచ్చింది. ఆమె అమ్మ అని పిలిచేంత గొప్పగా చూసుకునేది. అయితే అప్పటికీ నేను ఏ పనిలేకుండా తిరగుతుంటే ఒక ఆంటీ తిట్టింది. దీంతో నా కొడుకును ఇలా ఎవరూ అనకూడదని వదినమ్మ బాధపడింది. ఆ మాటతో నేను పూర్తిగా మారిపోయా. ఆమె వల్లే నేను ఈ రోజు ఈ స్థాయికి చెరుకున్నా' అంటూ ఆసక్తికర స్టోరీ వివరించాడు జక్కన్న. #ss-rajamouli #chennai #karnataka మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి