Dubai: దుబాయ్‌లో మళ్ళీ దంచికొడుతున్న వానలు

క్రితంసారి పడిన వర్షాలకు దుబాయ్ ఇంకా తేరుకోనే లేదు ఇప్పుడు మళ్ళీ ఆ దేశాన్ని వానలు, వరదలు ముంచెత్తాయి. నగరంలో పలు ప్రాంతాలు భారీ వరదల నీటిలో మునిగిపోయాయి. దీంతో అక్కడి జనజీవనం అస్తవ్యస్తం అవడంతో పాటూ మళ్ళీ పలు విమానాలు రద్దు అయ్యాయి.

New Update
Dubai: దుబాయ్‌లో మళ్ళీ దంచికొడుతున్న వానలు

Heavy Rains Again In Dubai: రెండు వారాలకు ముందు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌ని రెండు వారాల క్రితం వర్షాలు, వరదలు ఏ రేంజ్‌లో ముంచేశాయో అందరికీ తెలిసిందే. దీంతో ఒక్క దెబ్బకు నగరం అంతా అస్తవ్యస్తం అయిపోయింది. జనసీవనం అతలాకుతలం అయిపోయారు. ఇప్పుడిప్పుడే ఆపరిస్థితుల నుంచి దుబాయ్ కోలుకుంటోంది. కానీ ఇప్పుడు దుబాయ్‌లో మళ్ళీ వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షం, ఉరుములు కారణంగా ఎడారి దేశంలో పలు అంతర్జాతీయ విమానాలు తాత్కాలికంగా రద్దయ్యాయి.

రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం..

భారీ వర్షాలు కారణంగా దుబాయ్, షార్జా, అబుదాబి నగరాలు వరద నీటితో నిండిపోయాయి. దీనివలన అక్కడ రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. విమానాలు కూడా చాలా రద్దయ్యాయి. మరికొన్నింటిని దారి మళ్ళించారు. అబుదాబిలో చాలా వీధుల్లో వరద నీరు భారీగా నిలిచిపోయింది. అయితే రెండు వారాల క్రితం కురిసిన వానల కంటే ఈసారి తక్కువ వర్షాలే పడతాయని దుబాయ్ నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ చెప్పింది. అయినా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిన్న మొదలైన వర్షం, ఈరోజు కూడా కంటిన్యూ అవకాశాలున్నాయని తెలిపింది.

ఆందోళనలో ప్రజలు..

వర్సాలు, బలమైన గాలులకు నగరాల్లో చెట్టు, విద్యుత్ స్తంభాలు నేలకొరుగుతున్నాయి. దాంతో పాటూ నీరు ఎక్కడిక్కడే నిలిచిపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 1949 తరువాత ఈ నగరాల్లో ఇంతలా భారీ వర్షాలు పడడం ఇదే. క్రితం సారి కురిసిన వర్షాలకు అయితే చాలా మంది మృత్యువాత కూడా పడ్డారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితే వస్తుందేమోనని యునైటెడ్ అరబ్ ప్రజలు భయపడుతున్నారు.

Also Read:USA: రెఫ్యూజీలను అనుమతించడానికి ఇండియాకు భయం..జోబైడెన్ సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
తాజా కథనాలు