Train Broke Down: రైలును నెట్టిన కార్మికులు... వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ, నిహాల్‌ఘడ్ రైల్వేస్టేషన్ల వద్ద ఓ రైలు ఆగిపోయింది. దాన్ని రిపేర్ చేసేందుకు రైల్వే సిబ్బంది ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో చివరికి రైల్వే కార్మికులు దాన్ని నెట్టి లూప్‌లైన్‌లోకి చేర్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.

New Update
Train Broke Down: రైలును నెట్టిన కార్మికులు... వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లో ఓ ఆసక్తికర ఘటన వెలుగుచూసింది. రైల్వే కార్మికులు ఏకంగా ఓ రైలు బోగిని నెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. యూపిలోని అమేఠీ, నిహాల్‌ఘడ్ రైల్వేస్టేషన్ల వద్ద ఓ రైలు  ఆగిపోయింది. దాన్ని రిపేర్ చేసేందుకు రైల్వే సిబ్బంది ప్రయత్నాలు చేశారు. కానీ లాభం లేకపోయింది. పట్టాలపైనే రైలు నిలిచిపోవడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Also Read: భర్త అరెస్టుపై స్పందించిన సునీతా కేజ్రీవాల్.. మోదీపై ధ్వజం

దీంతో అక్కడ ఉన్న రైల్వే కార్మికులు ఆ రైలు బోగిని మెయిన్‌ లైన్ నుంచి లూప్‌లైన్‌లోకి నెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే వాళ్లు.. ఆ రైలును బోగీని నెట్టినంత సేపు రైల్వే గేటు మూసి ఉంచారు. దీంతో ఆ మార్గంలో వెళ్లాల్సిన ప్రయాణికులు కొద్దిసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిబ్బంది రైలు బోగిని నెడుతున్న దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో.. నెటీజన్లు ఈ ఘటనపై విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.

ఈ వీడియో ఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌ఎస్‌ శర్మ దృష్టికి వెళ్లడంచో ఆయన దీనిపై స్పందించారు. అది ఒక బోగితో ఉన్న డీపీసీ రైలని.. దానిపై రైల్వే అధికారులు కూర్చొని తనిఖీలు చేస్తారని పేర్కొన్నారు. సుల్తాన్‌పూర్ నుంచి అధికారులు లక్నో వైపుగా వెళ్తుండగా.. నిహాల్‌ఘట్‌ రైల్వేస్టేషన్‌ దగ్గర్లో ఈ రైలు బోగీ ఆగిపోయినట్లు తెలిపారు. దీన్ని బాగు చేయడానికి సిబ్బంది ప్రయత్నించినా అది సాధ్యం కాకపోవడంతో చివరికి లూప్‌లైన్‌లోకి తీసుకెళ్లినట్లు వివరించారు.

Also Read: సీఎం కేజ్రీవాల్‌కు 6 రోజుల కస్టడీ

Advertisment
Advertisment
తాజా కథనాలు