Telangana BJP: కాంగ్రెస్ లో జంప్ అయిన వివేక్.. మరి బీజేపీ మేనిఫెస్టో సంగతేంటి?

మరో 28 రోజుల్లో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలన్నీ అభ్యర్ధులు, మేనిఫెస్టోలు రెడీగా ఉన్నాయి ఒక్క బీజేపీ తప్ప. దానికి తోడు ఇప్పుడు వివేక్ పార్టీ నుంచి వెళ్ళిపోవడంతో అసలు మేనిఫెస్టో వస్తుందా రాదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

New Update
Telangana BJP: కాంగ్రెస్ లో జంప్ అయిన వివేక్.. మరి బీజేపీ మేనిఫెస్టో సంగతేంటి?

తెలంగాణ నుంచి బీజేపీ సీనియర్ నేతలు ఒక్కొక్కరే వెళ్ళిపోతున్నారు. ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు వివేక్ కూడా నిన్న పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. అలాగే కాంగ్రెస్ లో కూడా చేరిపోయారు. అంతకు ముందు బీజేపీ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్ళిపోయారు. ఆయన లేకుండానే బీజేపీ అభ్యర్ధుల లిస్ట్ వెలువడింది. ఇప్పుడు వివేక్ వంతు. బీజేపీ అభ్యర్ధులను అయితే ప్రకటిస్తోంది కానీ... మేనిఫెస్టో గురించి మిత్రం ఇప్పటి వరకు ఊసెత్తడం లేదు. ఇప్పుడు ఆ కమిటీలోని ఛైర్మన్ వివేక్ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. దీంతో బీజేపీ మేనిఫెస్టో అసలు వస్తుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Also Read:జగన్ కేసుల్లో జాప్యం అంటూ ఆర్ఆర్ఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్-ఎల్లుండి విచారణ

తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నెలాఖరుకే పోలింగ్ జరగనుంది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలవుతుంది. దాదాపు అన్ని పార్టీలు తమ అభ్యర్ధులను ప్రకటించేశాయి. అలాగే మేనిఫెస్టోలను కూడా. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అలాగే కాంగ్రెస్ కూడా ఆరు వరాలతో తెగ ప్రచారం చేసేసుకుంటోంది. కానీ బీజేపీ మాత్రం ఇప్పటి వరకు ఆ వూసే ఎత్తడం లేదు. దానికి తోడు జంపింగ్ జపాంగ్‌లతోటి తెలంగాణ బీజేపీకి తలనొప్పిగా మారింది. ముఖ్య కమిటీల్లో ఉన్న నేతలందరూ ఒక్కొక్కరే వెళ్ళిపోవడంతో ఆ లోట్లను పూడ్చుకుంటూ కూర్చుంటోంది. స్క్రీనింగ్ కమిటీలో ఉన్న ముఖ్య నేత కోమటిరెడ్డి వెళ్ళిపోయినా ఎలాగోలా కిందా మీదా పడి అభ్యర్ధులను ఖరారు చేసింది పార్టీ. ఈరోజు 48 మందితో థర్డ్ లిస్ట్ కూడా ప్రకటించనుంది. అదయితే జరిగిపోయింది కానీ....మేనిఫెస్టో విషయం మాత్రం డౌట్‌గానే ఉంది. నిన్నటి వరకూ వివేక్ బీజెపీలోనే ఉన్నా మేనిఫెస్టో కమిటీ కార్యక్రమాల్లో అస్సలు పాల్గొనలేదు. పార్టీ మీద వ్యతిరేకత తెలియజేయడానికి అన్నింటికీ దూరంగానే ఉంటూ వచ్చారు. దీన్ని బట్టి అసలు మేనిఫెస్టో రెడీ అయిందా అనే అనుమానం కూడా బలపడుతోంది.

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ జి.వివేకానంద ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఒకవైపు ఢిల్లీలో బీజేపీ అభ్యర్థులను ఖరారు చేయడానికి ఎలక్షన్ కమిటీ సమావేశం జరుగుతున్న సమయంలోనే ఆయన పార్టీ స్టేట్ చీఫ్‌కు రాజీనామా లేఖను పంపారు. నిమిషాల వ్యవధిలోనే ఆయన కాంగ్రెస్ పార్టీ దగ్గరకు చేరారు.

పార్టీలోంచి ఎంతమంది వెళ్ళిపోయినా పెద్దగా నష్టమేమీ లేదు అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రకటిస్తున్నారు తెలంగాణ బీజేపీ పెద్దలు. పార్టీకి సంబంధించి ఏదీ ఆగిపోదని అంటున్నారు. తెలంగాణలో ఈసారి విజయం సాధిస్తామని గట్టిగా చెబుతున్నారు కూడా. ఇన్ని మాట్లాడుతున్నారు కానీ అసలు జరగాల్సిన పనులు ఎందుకు జరగడం లేదో...ఎప్పుడు చేస్తారో మాత్రం చెప్పడం లేదు. ఈరోజు థర్డ్ లిస్ట్ ప్రకటించాక అయినా మేనిఫెస్టో గురించి మాట్లాడతారేమో...ఎప్పుడు వచ్చేది చెబుతారేమో చూడాలి.

Also Read:హైదరాబాద్‌ కాంగ్రెస్ నేతల ఇళ్ళల్లో ఐటీ సోదాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు