Pushpa 2 Release Date: పుష్ప-2 వచ్చేస్తున్నాడు...రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు

మోస్ట్ అవైటెడ్ తెలుగు సినిమా ఏదంటే పుష్ప-2 అనే చెప్పొచ్చు. పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత పార్ట్ 2 కోసం సినీ ప్రియులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ శుభవార్త చెప్పారు మైత్రీ మూవీ మేకర్స్. ఆగస్టు 15, 2024న పుష్ప-2 రిలీజ్ అవుతుందని ప్రకటించారు.

New Update
Pushpa 2 Release Date: పుష్ప-2 వచ్చేస్తున్నాడు...రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు

Allu Arjun Pushpa 2 Release Date Announced: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ఒక ఊపు ఊపేసింది. అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు (National Award) ను కూడా తెచ్చిపెట్టింది. పుష్ప మూవీ అయ్యాక దాని సీక్వెల్ కోసం జనాలు తెగ ఎదురు చూస్తున్నారు. ఏడాదిగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. మధ్యలో పుష్ప-2 గ్లింప్స్ ను విడుదల చేసిన సినిమా మీద మరింత హైప్ ను పెంచారు దర్శకుడు సుకుమార్ (Sukumar). పార్ట్ వన్ కన్నా పార్ట 2 నెక్స్ట్ లెవల్ ఉంటుందని ఎప్పటి నుంచో ఊరిస్తున్నారుకూడా. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా తెరకెక్కుతోందని దర్శకుడు, నటులు కూడా చెబుతూ వస్తున్నారు. తాజాగా ఈరోజు పుష్ప-2 రిలీజ్ డేట్ (Pushpa 2 Release date) ను కూడా అనౌన్స్ చేసింది మూవీ టీమ్.

వచ్చే ఏడాది ఆగస్ట్ 15న పుష్ప-2 రిలీజ్ అవుతుందని మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) అనౌన్స్ చేసింది. తన ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది. అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ లో ఉన్న పోస్టర్ మీద రిలీజ్ డేట్ ను పెట్టి పోస్టర్ ను విడుదల చేసింది. 2024లో ఆగస్టు 15 లాంగ్ వీకెండ్ లో వస్తోంది. ఆగస్టు 15 గురువారం పడింది. దాని తర్వాత శుక్రవారం ఒక్కరోజు వర్కింగ్ డే ఉంటుంది. సాధారణంగా ఇలా ఉంటే ఆరోజును లీవ్ తీసుకుని లాంగ్ వీకెండ్ గా మార్చుకుంటారు. అలా అయితే వరుసగా నాలుగు రోజులు లేకపోయినా కూడా మూడు రోజులు సెలవులు వచ్చి మూవీ కలెక్షన్లకు బాగా వర్కౌట్ అవుతుంది. అందుకే ఈ డేట్ ను పుష్ప-2 కి లాక్ చేసినట్టు తెలుస్తోంది.

Also Read: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో సినిమా…పిచ్చెక్కించడం ఖాయం

పుష్ప-2 అన్ లిమిటెడ్ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. సినిమాలో ప్రతీ సీన్ బాగా వచ్చేంతవరకు దర్శకుడు సుకుమార్ కాంప్రమైజ్ అవ్వడంలేదని టాక్ వినిపిస్తోంది. అందుకే మూవీ రిలీజ్ ఇంత లేట్ అయిందని కూడా చెబుతున్నారు.

Also Read: మెగా కోడలిని మెచ్చుకుంటున్న ఫ్యాన్స్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Raashii Khanna: రెడ్ బికినీలో రాశి గ్లామర్ షో.. నెట్టింట ఫొటోలు వైరల్

నటి రాశి ఖన్నా లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది. రెడ్ స్విమ్ సూట్ లో రాశి హాట్ ఫోజులు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు చూశారా..?

New Update
Advertisment
Advertisment
Advertisment