Vinesh Phogat : వినేశ్ ఫోగట్‌కు అనారోగ్యం.. అనర్హతపై ఆరాతీసిన మోదీ.. వారితో కీలక చర్చలు! వినేశ్ ఫోగట్ అనర్హత వేటుపై ప్రధాని మోదీ స్పందించారు. వినేశ్ నీవు భారతీయులందరికీ స్ఫూర్తిదాయకం. ఛాంపియన్లకే ఛాంపియన్. నీ ప్రతిభ దేశానికి గర్వకారణం అంటూ పొగిడేశారు. అలాగే అనర్హతపై పీటీ ఉషాను ఆరాతీసిన మోదీ.. దీనిపై నిరసన వ్యక్తం చేయాలని సూచించారు. By srinivas 07 Aug 2024 in ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ (Vinesh Phogat) అనర్హత వేటుపై ప్రధాని మోదీ (PM Modi) స్పందించారు. వినేశ్.. నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్. నీ ప్రతిభ దేశానికి గర్వకారణం అంటూ ఓదార్చే ప్రయత్నం చేశారు. 'వినేశ్ నీవు భారతీయులందరికీ స్ఫూర్తిదాయకం. ఈ రోజు నీకు తగిలిన ఎదురుదెబ్బ ఎంతో బాధించింది. దీనిని వ్యక్తపరడచడానికి నా దగ్గర మాటల్లేవు. దీని నుంచి నీవు బయటపడి మరింత బలంగా తిరిగొస్తావని నమ్ముతున్నా. నీకు మేమంతా అండగా ఉంటాం' అని ధైర్యాన్ని నింపారు. Vinesh, you are a champion among champions! You are India's pride and an inspiration for each and every Indian. Today's setback hurts. I wish words could express the sense of despair that I am experiencing. At the same time, I know that you epitomise resilience. It has always… — Narendra Modi (@narendramodi) August 7, 2024 అలాగే అనర్హతపై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషను ఆరాతీశారు మోదీ. వినేశ్ కు సహాయం చేయడానికి పూర్తి స్థాయి ప్రయత్నాలు చేయాలని సూచించాడు. ఆమెపై అనర్హత వేటు వేస్తే తీవ్ర నిరసన వ్యక్తం చేయాలని పిటి ఉషకు తెలిపారు. ఆమె పోటీలో పాల్గొనేందుకు ఉన్న అవకాశాలన్నీ పరిశీలించాలని కోరారు. అలాగే డిహైడ్రేషన్ లో ఆస్పత్రిలో చేరిన ఫోగట్ ఆరోగ్యంపై కూడా మోదీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. एक ही दिन में दुनिया की तीन धुरंधर पहलवानों को हराने के बाद आज विनेश के साथ-साथ पूरा देश भावुक है। जिन्होंने भी विनेश और उसके साथियों के संघर्ष को झुठलाया, उनकी नीयत और काबिलियत तक पर प्रश्नचिन्ह खड़े किए, उन सभी को जवाब मिल चुका है। आज भारत की बहादुर बेटी के सामने सत्ता का… pic.twitter.com/MzfIrYfRog — Rahul Gandhi (@RahulGandhi) August 6, 2024 ఇక పారిస్ ఒలంపిక్స్‌లో ఫైనల్స్‌లోకి అడుగుపెట్టిన మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్‌ను లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అభినందించారు. ‘ఒకే రోజులో ప్రపంచంలోని ముగ్గురు అత్యుత్తమ రెజ్లర్లను ఓడించినందుకు వినేష్‌తో పాటు దేశం మొత్తం ఉద్వేగానికి లోనైంది. వినేష్, ఆమె సహచరుల పోరాటాన్ని తిరస్కరించిన వారందరూ, వారి ఉద్దేశాలు సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇది చాంపియన్లకు ఎంతో గర్వకారణం. విమర్శించిన వారికి మైదానంలోనే తగిన సమాధానం ఇచ్చారు. ఆమె రక్తపు కన్నీళ్లు కార్చడానికి కారణమైన అధికార వ్యవస్థ మొత్తం ప్రస్తుతం కుప్ప కూలింది. ప్యారిస్‌లో ఫొగట్ సాధించిన విజయాల ప్రతిధ్వని ఢిల్లీలో స్పష్టంగా వినిపిస్తోంది' అన్నారు రాహుల్ గాంధీ. PM Narendra Modi spoke to IOA President PT Usha and sought first-hand information from her on the issue and the options India has in the wake of Vinesh's setback. He asked her to explore the full range of options to help Vinesh’s case. He also urged PT Usha to file a strong… pic.twitter.com/qlGivfAXqL — ANI (@ANI) August 7, 2024 Also Read : నటుడు బిత్తిరి సత్తిపై కేసు నమోదు #2024-paris-olympics #rahul-gandhi #pm-narendra-modi #vinesh-phogat మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి