Crime: గర్భిణీపై గ్యాంగ్‌ రేప్‌.. ఆ తర్వాత కిరోసిన్‌ పోసి నిప్పంటించిన దుండగులు

మధ్యప్రదేశ్‌లో ఓ గర్భిణి(34)పై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. 80 శాతం కాలిన గాయాలతో బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఓ కేసు విషయంపై రాజీ కుదుర్చేందుకు వెళ్లడంతో ఆమెపై ఈ దారుణం జరిగింది.

New Update
Crime: గర్భిణీపై గ్యాంగ్‌ రేప్‌.. ఆ తర్వాత కిరోసిన్‌ పోసి నిప్పంటించిన దుండగులు

మహిళలపై కొందరు మగపుటేనుగలు చేస్తున్న దారుణాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట మహిళలలు అత్యాచారానికి గురవుతూనే ఉన్నారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి శిక్షిస్తున్నా కూడా ఇలాంటి ఆగాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా మరో దారుణం చోటుచేసుకుంది. ఓ గర్భిణి(34)పై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడటం  కలకలం రేపింది. అంతేకాదు ఆ తర్వాత ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఈ దుర్ఘటన మధ్యప్రదేశ్‌లోని మొరానా జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది.

Also Read: ఆ రాష్ట్రంలో పీచు మిఠాయిపై నిషేధం.. ఎందుకంటే

ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడుతోంది. ఆమె శరీరం 80 శాతం గాయాలతో కాలిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలి భర్త ఓ లైంగిక దాడి నేరంలో జైలుకెళ్లి ఇటీవలే బెయిల్‌పై బయటికి వచ్చాడు. అయితే తన భర్తపై లైంగిక దాడి పెట్టిన మహిళతో రాజీ చేయడానికి బాధితురాలు ప్రయత్నించింది. ఇందుకోసం తన భర్తపై కేసు పెట్టిన మహిళ గ్రామానికి వెళ్లింది. అక్కడ ఆమె ఇంట్లో ముగ్గురు వ్యక్తులు బాధితురాలిపై సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: వచ్చేసారి తెలంగాణలో బీజేపీదే అధికారం: జేపీ నడ్డా

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH vs MI: కష్టాల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్.. 5 వికెట్లు ఢమాల్- స్కోర్ చూస్తే షాకే

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కష్టాల్లో పడింది. ముంబై ఇండియన్స్ బౌలర్ల దాటికి తట్టుకోలేక చేతులెత్తేసింది. 15 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. క్రీజులో క్లాసెన్ 51*, అభినవ్ 12* ఉన్నారు.

New Update
SRH vs MI NEW

ముంబై ఇండియన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చేతులెత్తేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన SRH జట్టు ప్రారంభం నుంచే తడబడింది. ఓపెనర్లుగా క్రీజ్‌లోకి వచ్చిన ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ దూకుడుగా ఆడే క్రమంలో పెవిలియన్‌కు చేరారు. తొలి ఓవర్‌కు 2 పరుగులు చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ 2 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయింది. ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్‌ డకౌట్‌ అయ్యాడు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

SRH vs MI

వెను వెంటనే 2 ఓవర్1వ బంతికి సన్‌రైజర్స్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఇషాన్‌ కిషన్‌ (1) ఔట్‌అయ్యాడు. దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ రికెల్‌టన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఓవర్‌లోనే మరో వికెట్ డౌన్ అయింది. 3 ఓవర్ 3వ బంతికి  అభిషేక్‌ శర్మ (8) ఔటయ్యాడు. ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఇలా 4 ఓవర్లకు 13/3 స్కోర్‌ చేసింది. 

వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఇక ఎవరూ ఊహించని రీతిలో నాలుగో వికెట్‌ను హైదరాబాద్ జట్టు కోల్పోయింది. 4 ఓవర్1వ బంతికి నితీశ్‌ కుమార్‌ రెడ్డి (2) ఔట్‌ అయ్యాడు. దీంతో 5 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 15 పరుగులు చేశారు. క్రీజులో అనికేత్‌ వర్మ, హెన్రిచ్‌ క్లాసెన్‌ మెల్లి మెల్లిగా పరుగులు రాబడుతూ వచ్చారు.

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

అదే సమయంలో మరో బిగ్ షాక్ తగిలింది. అనికేత్‌ వర్మ (12) ఔట్‌ అయ్యాడు. హార్దిక్‌ పాండ్య వేసిన 8 ఓవర్ 3వ బంతికి వికెట్‌ కీపర్‌ రికెల్‌టన్‌కు క్యాచ్‌ ఇచ్చి అనికేత్‌ వెనుదిరిగాడు. దీంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 35 పరుగుల వద్ద 5వ వికెట్‌ కోల్పోయింది. ఇలా వరుస వికెట్ల నష్టంతో హైదరాబాద్ జట్టు కష్టాల్లో పడింది. స్టార్ బ్యాటర్లందరూ ఔటవడంతో కనీసం 100 పరుగులు అయినా చేస్తారా? అనే సందేహంలో ఫ్యాన్స్ ఉన్నారు. మొత్తంగా 15 ఓవర్లకు స్కోర్‌ 90/5 చేసింది. ప్రస్తుతం క్రీజులో క్లాసెన్‌ 45*, అభినవ్‌10* ఉన్నారు. 

IPL 2025 | srh-vs-mi | IPL 2025 SRH vs MI Live Score | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment