తమిళనాడులోని ఈరోడ్ తూర్పు అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈవీకేఎస్ ఎలంగోవన్ డిసెంబర్‌లో మరణించారు. దీంతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఫిబ్రవరి 5న ఉప ఎన్నిక జరుగనున్నది. డీఎంకే అభ్యర్థిగా వీసీ చంద్రకుమార్ నామినేషన్ దాఖలు చేశారు.
Read also : బీజీపీ మేనిఫెస్టోపై స్పందించిన కేజ్రీవాల్.. మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
ఎన్‌టీకే అభ్యర్థి ఎంకే సీతాలక్ష్మి ఆయనపై తలపడుతున్నారు. ఈ ఉప ఎన్నికకు మిగతా పార్టీలు దూరంగా ఉన్నాయి. తాజాగా యాక్టర్ విజయ్ దళపతి పెట్టిన కొత్త పార్టీ తమిఝగ వెట్రి కజగం కూడా ఈ ఎన్నికలను బహిష్కరించింది. తాత్కాలిక ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని చెప్పారు. దీంతో డీఎంకే, ఎన్‌టీకే మధ్య పోటీ నెలకొన్నది.
అన్నాడీఎంకే, బీజేపీ, డీఎండీకే సహా పలు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఈ ఉప ఎన్నికను బహిష్కరించినట్లు ఇప్పటికే ప్రకటించాయి. విజయ్ పార్టీ టీవీకే గతంలో విక్రవాండి ఉప ఎన్నికను కూడా బహిష్కరించింది. ఆ పార్టీ తన వైఖరిని తాజాగా సమర్థించుకున్నది. ఉప ఎన్నికలో గెలవడానికి సీఎం ఎంకే స్టాలిన్ డీఎంకే ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు ఆరోపించింది.
Also Read: ఏపీకి గుడ్‌న్యూస్.. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 ప్యాకెజీ
టీవీకే జనరల్ సెక్రటరీ ఎన్ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడులోని రూలిగ్ పార్టీ ప్రజాస్వామ్య నిబంధనలు పాటించకుండా, ఉప ఎన్నికలలో గెలవడానికి అధికారాన్ని ఉపయోగిస్తుందని విమర్శించారు. అలాగే ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారు. 2026లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలపైనే TVK ఫొకస్ పెట్టిందని విజయ్ తెలిపారు.
ఇది కూడా చూడండి: Arvind Kejriwal: ప్రధానిమోదీకి కేజ్రీవాల్ సంచలన లేఖ.. ఏం చెప్పారంటే ?