/rtv/media/media_files/2026/05/28/siddaramaiah-2026-05-28-10-58-33.jpg)
కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సీఎం పదవి నుంచి తప్పుకోవడంతో పాటు మంత్రివర్గాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ విషయాన్ని తన కేబినెట్ మంత్రులకు తెలియజేశారు. పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఆయన ఈ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్ బాంబేలో ఉన్నారు. ఆయన అందుబాటులోకి రాగానే రాజీనామా లేఖను సమర్పించేందుకు సిద్ధరామయ్య రెడీ అయ్యారు. ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్‌ను కలవడానికి అపాయింట్‌మెంట్ కోరారు.
CM Siddaramaiah has officially announced to his cabinet and party colleagues that he has decided to resign as the CM of Karnataka. pic.twitter.com/a2mC8ZUSAg
— Deepak Bopanna (@dpkBopanna) May 28, 2026
Follow Us