EC Raids-Punjab CM: ఆప్ నేత, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఢిల్లీలోని అధికారిక నివాసంపై పోలీసులు సోదాలు నిర్వహించారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో సోదాలు చేసేందుకు ఎన్నికల కమిషన్ అధికారులు పోలీసులతో చేరుకున్నారని పేర్కొంది. ఢిల్లీ సీఎం అతిషి దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎన్నికల కోసం ప్రచారం చేస్తున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను బీజేపీ టార్గెట్ చేసిందని ఆమె మండిపడ్డారు. ఢిల్లీ ఎలక్షన్లో బీజేపీ నాయకులు పట్టపగలే డబ్బులు, మద్యం లాంటివి బహిరంగంగా పంచుతూ ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తుంటే.. అవి పోలీసులకు కనిపించవని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో పంజాబ్ ముఖ్యమంత్రి ఇంటిపై మాత్రం రైడ్స్ చేస్తారని సోషల్ మీడియాలో ఆరోపించారు.
#WATCH | Delhi EC team at Kapurthala House, the official residence of Punjab CM Bhagwant Mann in Delhi, following a complaint about alleged cash distribution on cVIGIL app
— ANI (@ANI) January 30, 2025
Returning Officer OP Pandey says, "We were told that we can check the periphery here (Kapurthala House).… pic.twitter.com/mpFHFAD3oL
ఇది కూడా చదవండి : రేవంత్ సర్కార్ కు బిగ్ షాక్.. ఆ పథకాలకు ఈసీ బ్రేక్!
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఇంటిపై సోదాలు..
దీనిపై పోలీసులు స్పందించారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఇంటిపై సోదాలు చేయడానికి వారు అక్కడికి వెళ్లాలేదని చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలను ఎలక్షన్ కమిషన్ రిటర్నింగ్ ఆఫీసర్ పాండ్యా ఖండించారు. ఢిల్లీలోని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కపుర్తలా హౌస్‌పై రైడ్ చేయలేదని స్పష్టం చేశారు. అక్కడ డబ్బులు పంచుతున్నారని సీ విజిల్ పోర్టల్‌లో వచ్చిన ఫిర్యాదు దర్యాప్తు చేయడానికి రిటర్నింగ్ ఆఫీసర్ టీం వచ్చినట్లు పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఇంట్లోకి వెళ్లకుండా సెక్యూరిటీ సిబ్బంది డోర్స్ లాక్స్ దర్యాప్తు చేయలేదని అధికారులు చెప్పారు. దీంతో పోలీసులు వెనుదిరిగి వెళ్లిపోయినట్లు చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి : USA: గడ్డకట్టే చలిలో నీళ్ళల్లో పడి బతకడం కష్టమే..ఇప్పటికి 18మంది మృతి