West Bengal: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. బీజేపీలోకి టీఎంసీ ఎంపీ, ఎమ్మెల్యేలు?

తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఒక ఎంపీ, ఆరుగురు ఎమ్మెల్యేలు సీఎం సువేందు అధికారి ఏర్పాటు చేసిన సీక్రెట్ మీటింగ్‌కు హాజరైనట్లు తెలుస్తోంది.

New Update
FotoJet (5)

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఒక ఎంపీ, ఆరుగురు ఎమ్మెల్యేలు సీఎం సువేందు అధికారి ఏర్పాటు చేసిన సీక్రెట్ మీటింగ్‌కు హాజరైనట్లు తెలుస్తోంది. అయితే పార్టీ మారుతున్నారని కాకుండా.. కేవలం తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే ఈ మీటింగ్‌కు వెళ్లినట్లు వారు స్పష్టం చేశారు. రాజకీయాలను పక్కన పెడితే.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్ష నేతతో చర్చలు జరపడం తప్పేమీ కాదన్నారు. కానీ వీరంతా పార్టీ మారుతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. 

ఇది కూడా చూడండి: Prabhas Spirit: ప్ర‌భాస్ తో తృప్తి డిమ్రి యాక్షన్ షురూ.. ‘స్పిరిట్’ షూటింగ్ ‘స్పెష‌ల్’ అప్డేట్!

తన వైపు తిప్పుకోవాలనే..

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సీఎం సువేందు అధికారి సంచలనం సృష్టించారు. ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్‌లో సువేందు అధికారి మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడిగా, కీలక నేతగా ఉన్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరి ఆ పార్టీని బెంగాల్‌లో బలమైన పునాది వేశారు. ఇప్పుడు టీఎంసీ పార్టీ నేతలను తన వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై తృణమూల్ కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోంది. బయటకు ఇది అభివృద్ధికి చెందిన మీటింగ్ అని చెబుతున్నప్పటికీ.. లోపల మాత్రం అసంతృప్తితో ఉన్న నేతలను సువేందు తనవైపు ఆకర్షిస్తున్నారనే భయం టీఎంసీలో మొదలైంది. దీనిపై మమతా బెనర్జీ ఇంకా స్పందించలేదు. 

ఇది కూడా చూడండి: Tamil Nadu : తమిళనాడులో STF చీఫ్ గా 'లేడీ సింగం'భవానీశ్వరి? ఇంతకు ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటో తెలుసా?

Advertisment
తాజా కథనాలు