Manu Bhaker: ఒలింపిక్స్ విజేత మను భాకర్‌కు రాజకీయ ప్రముఖుల అభినందనలు పారిస్ ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో మను భాకర్ కాంస్య పతకం సాధించడంతో రాజకీయ ప్రముఖులు ఆమెను ప్రశంసించారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. By B Aravind 28 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి పారిస్ ఒలింపిక్స్ గేమ్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో మను భాకర్ కాంస్య పతకం సాధించి భారతీయ జెండాను ఒలంపిక్స్ వేదికపై రెపరెపలాడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఆమెను సినీ, రాజకీయ ప్రముఖులతో సహా అనేక మంది అభినందనలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. ఇది చారిత్రామ్మక మెడల్ అంటూ మను భాకర్‌ను కొనియాడుతూ.. ప్రధాని మోదీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున మొదటి మెడల్ సాధించండంపై ఆమెకు అభినందనలు తెలిపారు. అలాగే భారత్ నుంచి షూటింగ్‌లో మొదటి మహిళగా ఆమె పథకం సాధించినందున ఈ విజయం ఎంతో ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. A historic medal! Well done, @realmanubhaker, for winning India’s FIRST medal at #ParisOlympics2024! Congrats for the Bronze. This success is even more special as she becomes the 1st woman to win a medal in shooting for India. An incredible achievement!#Cheer4Bharat — Narendra Modi (@narendramodi) July 28, 2024 ఒలింపిక్స్‌లో తన ప్రతిభలో కాంస్య పతకం గెలిచి భారత్ కీర్తిని చాటిన మను భాకర్‌రు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభినందలు తెలియజేశారు. ఆమెను చూసి దేశం గర్వపడుతోందని తెలిపారు. మను భాకర్ సాధించిన ఈ విజయం ఎంతోమంది క్రీడాకారులు, ముఖ్యంగా మహిళలకు స్పూర్తిదాయకమంటూ ప్రశంసించారు. Heartiest congratulations to Manu Bhaker for opening India’s medal tally with her bronze medal in the 10 metre air pistol shooting event at the Paris Olympics. She is the first Indian woman to win an Olympic medal in a shooting competition. India is proud of Manu Bhaker. Her… — President of India (@rashtrapatibhvn) July 28, 2024 మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మను భాకర్‌కు అభినందనలు తెలియజేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో పథకం సాధించిన మొదటి మహిళగా మను భాకర్ చరిత్ర సృష్టించిందంటూ ప్రశంసించారు. Congratulations to @realmanubhaker on scripting history and becoming the first Indian woman to win a shooting medal at the Olympics! Her bronze-winning shot also marks India's first medal at the Paris Olympics 2024!🇮🇳#Cheer4Bharat #ParisOlympics2024 pic.twitter.com/VoUKuQ4Wt8 — N Chandrababu Naidu (@ncbn) July 28, 2024 Also Read : గ్రూప్-2,3 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ‘పొంగులేటి శీనన్న నిరుద్యోగ కానుక’గా ఫ్రీ కోచింగ్! #2024-paris-olympics #pm-modi #manu-bhaker #shooting #draupadi-murmu #cm-chandra-babu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి