Lok Sabha Elections: ఎన్నికల వేళ.. భారీగా నగదు, ఆభరణాలు పట్టివేత లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కర్ణాటలోని బళ్లారిలో ఓ స్థానిక వ్యాపారి ఇంట్లో పోలీసులు సోదాలు జరుపగా.. ఏకంగా రూ.7.6 కోట్ల నగదు, బంగారు, వెండి ఆభరణాలను గుర్తించారు. ప్రస్తుతం వ్యాపారి నరేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. By B Aravind 08 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Karnataka: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీల నేతలు ఎన్నికల ప్రచారాల్లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని తాజాగా భారీగా అక్రమ నగదు, బంగారం బయటపడింది. బళ్లారిలోని ఓ వ్యాపారి ఇంట్లో పోలీసులు సోదాలు జరపగా.. ఏకంగా రూ.7.6 కోట్ల నగదు, బంగారు, వెండి ఆభరణాలను గుర్తించారు. ముందుగా బళ్లారిలో హవాలా కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో.. వెంటనే బ్రూస్‌పేట్ పోలీసులు రంగంలోకి దిగారు. Also Read: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..నో బెయిల్ స్థానిక ఆభరణాల వ్యాపారి నరేశ్ సోనీ ఇంట్లో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. చివరికి భారీ నగదు, ఆభరణాలను గుర్తించారు. రూ.5.6 కోట్ల నగదు, 3 కిలోల బంగారం, 103 కిలోల వెండి ఆభరణాలు, 68 వెండి కడ్డీలను పోలీసులు స్వాధీవం చేసుకున్నారు. హవాలా మార్గంలో వీటిని తీసుకొచ్చి ఉంటారనే అనుమానం రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం వ్యాపారి నరేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అలాగే ఇందుకు సంబంధించిన వివరాలను ఆదాయపు పన్ను విభాగానికి అందజేస్తామని.. ఆ తర్వాత ఐటీ అధికారులు దీనిపై తదుపరి విచారణ చేపడతారని పేర్కొన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. ఈ ఘటన కర్ణాటకలో చర్చనీయాంశమవుతోంది. ఆ రాష్ట్రంలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ రెండు దశల్లో ఏప్రిల్ 26, మే 4న పోలింగ్ జరగనుంది. Also Read: ఈరోజు సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా ? #telugu-news #national-news #lok-sabha-elections-2024 #karnataka-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి