Telangana : తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ, అమిత్ షా ఏప్రిల్ 25న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. వరంగల్‌తో సహా రెండు, మూడు చోట్ల ఆయన ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే ఈ నెలాఖరులో లేదా మే మొదటి వారంలో ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన చేయనున్నారు. By B Aravind 21 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Lok Sabha Elections : లోక్‌సభ ఎన్నికల వేళ.. తెలంగాణ(Telangana) లో బీజేపీ(BJP) ప్రచారాల దూకుడు పెంచేందుకు సిద్ధమైంది. ఈ నెల 25వ తేదీ నాటికి నామినేషన్లు దాఖలు గడువు ముగియనుంది. ఈ సందర్భంగా పలువురు పార్టీ జాతీయ నేతలు రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. ఏప్రిల్ 25న కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) తెలంగాణలో పర్యటించనున్నారు. వరంగల్‌తో సహా రెండు, మూడు చోట్ల ఆయన ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తీరు, క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న ప్రచారానికి సంబంధించి ఆయన సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. Also Read: ఇంటర్ ఫలితాల తేదీ వచ్చేసింది.. అలాగే ఈ నెల చివరిలో లేదా మే మొదటి వారంలో ప్రధాని మోదీ(PM Modi) రాష్ట్ర పర్యటన చేయనున్నారు. మలివిడత ప్రచారంలో 3,4 సభలు, రోడ్‌షోల్లో పాల్గొంటారని తెలుస్తోంది. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) కూడా ఈ నెల చివర్లో లేదా మే 10వ తేదీ లోగా రాష్ట్రానికి వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 10 నుంచి 12 ఎంపీ సీట్లు గెలవాలని అధిష్ఠానం భావిస్తున్న నేపథ్యంలో.. ప్రధాని మేదీ, అమిత్ షా, పలువులు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు ప్రచారానికి రానున్నట్లు తెలుస్తోంది. Also Read: కాంగ్రెస్‌లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. బాంబ్ పేల్చిన మంత్రి ఉత్తమ్ #telugu-news #pm-modi #lok-sabha-elections-2024 #amit-shah మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి