PM Kisan : రైతులకు కీలక అప్‌డేట్.. పీఎం కిసాన్ 17వ విడత నిధుల ఎప్పుడంటే? మీరు రైతు కిసాన్ 17వ విడత ప్రయోజనం పొందాలనుకుంటే e-KYC, భూమి రికార్డులను వీలైనంత త్వరగా పథకంలో ధృవీకరించాలి. రానున్న జూన్‌లో 17వ విడత విడుదలయ్యే అవకాశం ఉంది. పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రతీఏడాది రైతులకు రూ.6వేల చొప్పున సాయం ఇస్తుంది. By Trinath 31 Mar 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Farmers Update : నగరాలు(Cities), గ్రామీణ ప్రాంతాల్లో(Rural Areas) నివసించే ప్రజల కోసం రాష్ట్రం, కేంద్రం అనేక పథకాలను అమలు చేస్తూ ఉంటాయి. పేద ప్రజలకు ప్రయోజనాలను అందించడం ప్రభుత్వాల లక్ష్యం. వీటిలో పీఎం రైతు కిసాన్(PM Kisan) ఒకటి. ఈ పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ.6,000 అందజేస్తారు. ఈ డబ్బును ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున మూడు విడతలుగా అందిస్తారు. ఈసారి పథకం తదుపరి విడత అంటే 17వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. కాబట్టి 17వ విడత ఎప్పుడు విడుదల అవుతుందో తెలుసుకుందాం! --> వాస్తవానికి ఈ పథకం కింద ఇప్పటి వరకు అర్హులైన రైతులు 16 వాయిదాలు పొందారు. గత ఫిబ్రవరి 28న 9 కోట్ల మంది రైతులకు 16వ విడత రుణమాఫీ జరిగింది. DBT ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ డబ్బును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. --> పథకం ప్రతి విడత దాదాపు 4 నెలల తర్వాత ఇస్తారు. ఫిబ్రవరిలో 16వ విడత విడుదలైంది కాబట్టి జూన్‌లో 17వ విడత విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. --> PM కిసాన్ యోజన కింద ఏదైనా వాయిదా విడుదలైనప్పుడు, దాని పూర్తి సమాచారం పథకం అధికారిక పోర్టల్ pmkisan.gov.in లో ఇస్తారు. తేదీలు, ఇతర సమాచారాన్ని ఇక్కడ చెక్ చేయవచ్చు. --> మీరు 17వ విడత ప్రయోజనం పొందాలనుకుంటే e-KYC, భూమి రికార్డులను వీలైనంత త్వరగా పథకంలో ధృవీకరించాలి. --> మీరు ఈ రెండు ముఖ్యమైన పనులను పూర్తి చేయకపోతే తదుపరి 17వ విడత ప్రయోజనం పొందలేరు. ఇది కాకుండా, పథకానికి దరఖాస్తు చేసేటప్పుడు ఏదైనా తప్పుడు సమాచారాన్ని నమోదు చేస్తే 17వ విడత ప్రయోజనం లభించదు. Also Read : మీ లవర్‌తో ఎంజాయ్ చేసేందుకు హైదరాబాద్‌లోని రొమాంటిక్ స్పాట్స్ ఇవే! #pm-kisan #e-kyc #rural-areas మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి