Telangana : డ్రగ్స్‌ను కంట్రోల్ చేయండి-ఎమ్మెల్యే రాజాసింగ్

ప్రతీ పబ్‌లోనూ పెద్దెత్తున డ్రగ్స్ సప్లయ్ అవుతున్నాయి.వాటి నుంచి యువతను కాపాడుకోవడం మన బాధ్యత అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.ఉత్తరప్రదేశ్ సీఎం యోగి క్రైమ్‌ను ఏవిధంగా కంట్రోల్ చేస్తున్నారో దృష్టి పెట్టండని సీఎం రేవంత్ రెడ్డికి ఆయన రిక్వెస్ట్ చేశారు.

New Update
Telangana : డ్రగ్స్‌ను కంట్రోల్ చేయండి-ఎమ్మెల్యే రాజాసింగ్

MLA Raja Singh : ఏదైనా కాలనీల్లో, బస్తీలో డ్రగ్స్ (Drugs) అమ్ముతూ కనిపిస్తే వారిపై కేసు పెట్టవద్దని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) క్రైమ్ ను ఏవిధంగా కంట్రోల్ చేస్తున్నారో దృష్టిపెట్టాలని శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. పిల్లల బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుందని, పిల్లలు ఏం చేస్తున్నారనే దానిపై నజర్ పెట్టాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ (Telangana) కు పెద్ద ఎత్తున డ్రగ్స్ సప్లయ్ అవుతోందని, ఎక్కువ శాతం డ్రగ్స్ యూజ్ చేసేది పబ్ లోనే అని ఆయన తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్ని పబ్ లు ఉన్నాయనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ప్రతి ఒక్క పబ్బుల్లో డ్రగ్స్ సప్లయ్ అవుతోందని, యువతీ యువకులు ఎక్కువ శాతం డ్రగ్స్ కి అలవాటుపడుతున్నారని పేర్కొన్నారు. దీన్ని కంట్రోల్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రతి హీరో, హీరోయిన్ డ్రగ్స్ వినియోగించవద్దని మెగాస్టార్ చిరంజీవిలాగా ముందుకు వచ్చి పిలుపునివ్వాలని కొనియాడారు. డ్రగ్స్ ను కంట్రోల్ చేసేందుకు నార్కోటిక్ టీమ్ ను కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, యూత్ ను కాపాడుకోవడం మన బాధ్యత అంటూ తెలిపారు. ఎందుకంటే భయం లేకుంటే ఎవరూ డ్రగ్స్ అమ్మడం మానరని, డ్రగ్స్ తీసుకున్నా, అమ్మినా నార్కోటిక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు.

Also Read:Telanagna: రాష్ట్రంలో రోడ్లు, భవనాల శాఖను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం-మంత్రి కోమటిరెడ్డి

Advertisment
Advertisment
తాజా కథనాలు