/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Flight-1-jpg.webp)
Pilot Delivers Baby in VietJet Flight: ప్రెగ్నెంట్ అయిన మహిళలు డెలివరీ అయ్యే సమయం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఏ క్షణం పురిటినొప్పులు వస్తాయో తెలియదు. ఒకవేళ ఆ సమయంలో దూర ప్రదేశాలకు వెళ్లినప్పుడు అకస్మాత్తుగా పురిటి నొప్పులు వస్తే.. దగ్గర్లో హాస్పిటల్ గానీ, వైద్యులు గానీ లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే తాజాగా ఫ్లైట్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విమానంలో వెళ్తున్న ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆ మహిళకు ఏకంగా పైలట్ డెలివరీ చేశారు. ఈ ఘటన వీట్‌జెట్‌కు (VietJet Flight) చెందిన విమానంలో జరిగింది.
Also Read: ఎలక్టోరల్ బాండ్లపై మల్లిఖార్జున ఖర్గే సంచలన ఆరోపణలు
రంగంలోకి దిగిన పైలట్
ఇక వివరాల్లోకి వెళ్తే.. తైవాన్ నుంచి బ్యాంకాక్ (Taiwan to Bangkok) వెళ్తున్న విమానంలో వెళ్తున్న ప్రయాణికుల్లో ఓ గర్భిణి కూడా ఉన్నారు. అయితే ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. బాత్‌రూంలో ఆమెను చూసిన ఫ్లైట్ సిబ్బంది ఈ విషయాన్ని జాకరిన్ (Jakarin) అనే పైలట్‌కు చెప్పారు. ల్యాండింగ్‌కు ఇంకా సమయం ఉండటం వల్ల ఫ్లైట్‌లోనే డెలివరీ చేయాల్సిన పరిస్థితిని ఏర్పడింది. ఆ సమయానికి విమానంలో వైద్యులు కూడా లేరు. దీంతో పైలట్ రంగంలోకి దిగాడు. ఫ్లైట్ నడపాల్సిన తన బాధ్యతను కో పైలట్‌కు అప్పజెప్పాడు. సెల్‌ఫోన్ ద్వారా వైద్యులను సంప్రదించిన పైలట్ వారి సూచనలతో ఆమెకు విజయవంతంగా డెలివరీ చేశాడు.
చిన్నారికి 'స్కై' అనే ముద్దు పేరు
పైలట్ చేసిన పనికి తోటీ ప్రయాణికులు ప్రశంసల వర్షం కురిపించారు. విమానంలో పుట్టిన ఈ శిశువుగా ముద్దుగా 'స్కై' (SKY) అని పేరు పెట్టారు. ఇక ఆ విమానం ల్యాండ్ అయిన తర్వాత తల్లిబిడ్డలను వైద్య సిబ్బంది పరీక్షించారు. వాళ్లు ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పారు. 18 ఏళ్లుగా జాకరిన్ పైలట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదుర్కోలేదని చెప్పారు. ఇదిలాఉండగా.. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ట్రావెల్ మెడిసన్ 2020లో చేసిన అధ్యయనం ప్రకారం.. 1929 నుంచి 2018 మధ్య వివిధ విమానంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. మొత్తం 74 మంది చిన్నారులు జన్మించింగా.. అందులో 71 మంది చిన్నారులు సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది.
Also read: ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట.. నిర్దోషి అని ప్రకటించిన బాంబే హైకోర్టు