India-pak:భారత భూభాగంలోకి అనుమానాస్పదంగా పాక్ డ్రోన్..

భారతలోకి పాకిస్తాన్ డ్రోన్ ఒకటి చొచ్చుకుని వచ్చింది. ఫిరోజ్ పుర్ జిల్లాలోని టిండీ వాలాలో బీఎస్ఎఫ్ అధికారులు దీనిని కనుగొన్నారు.

New Update
India-pak:భారత భూభాగంలోకి అనుమానాస్పదంగా పాక్ డ్రోన్..

భారత్-పాక్ సరిహద్దుల్లో ఎప్పుడూ అనుమానాస్పదంగానే ఉంటుంది. భారత్ లోకి ఎలాగోలా రావడానికి, మన రహస్యాలను తెలుసుకోవడానికి ఆ దేశం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఎప్పుడు అదును దొరుకుతుందా మన దేశం మీద అటాక్ చేద్దామా అని చూస్తూ ఉంటుంది పాకిస్తాన్. ఏళ్ళ తరబడి కొనసాగుతున్న రైవలరీని కొనసాగిస్తూ ఉంటుంది. బోర్డర్ లో కంటి మీద రెప్ప వేయకుండా మన జవాన్లు కాపలా కాస్తున్నా మన దేశంలోకి చొరబడ్డానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తూనే ఉంటుంది. తాజాగా పాక్ డ్రోన్ ఒకటి మన దేశంలోకి వచ్చింది.

Also read:నేటి బాలలే రేపటి పౌరులు అని గుర్తు చేసే చిల్డ్రన్స్ డే.

బోర్డర్ లోరి ఫిరోజ్ పుర్ జిల్లాలో టిండి వాలా అనే గ్రామంలో బీఎస్ఎఫ్ జవాన్లు ఒక డ్రోన్ ను కనుగొన్నారు. అది పక్క దేశం పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు కనుగొన్నారు. దీంతో అసలు ఆ డ్రోన్ ఏంటి? ఎందుకు మన దేశంలోకి వచ్చింది? దీని ద్వానా పాకిస్తాన్ ఏం చేయదలుచుకుంది అనే విషయాలను పరిశీలిస్తున్నారు మిలటరీ అధికారులు. ఇలా డ్రోన్ రావడం సస్పెక్ట్ చేసేదిగా ఉన్నా...ఇంకే ఇతర అలజడులు లేకపోవడంతో ఆందోళన పడవలసిన అవసరం లేదని చెబుతున్నారు.

మనకు వ్యతికేంగా పాకిస్తాన్ కు చైనా సహకరిస్తోందిన అన్నది బహిరంగ రహస్యం. అందుకు నిదర్శనంగా చైనా, పాకిస్థాన్‌లు అరేబియా సముద్రంలో భారీ నౌకాదళ విన్యాసాలకు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా తొలిసారి ఉమ్మడిగా సాగర గస్తీని నిర్వహిస్తున్నాయి. ఈ నెల 17 వరకూ కొనసాగుతాయి. ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం, సంప్రదాయ స్నేహాన్ని బలోపేతం చేయడంతోపాటు ఇరు సైన్యాల శిక్షణను మరింత సానబెట్టే క్రమంలోనే మూడోసారి ఈ తరహా విన్యాసాలు నిర్వహిస్తున్నామని చైనా రక్షణశాఖ అధికార ప్రతినిధి చెబుతున్నారు.

Also Read:తెలంగాణకు జాతీయ నేతల క్యూ.. ఒకే రోజు ఒకే చోట అమిత్ షా, రాహుల్ సభలు..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

అమెరికా కలలు ఇంక కల్లలుగానే మిగిలిపోతాయా అంటే అవుననే అనిపిస్తోంది. ఒకవైపు హెచ్ 1 వీసాల లాటరీ తగ్గించేశారు...మరోవైపు విద్యార్థి వీసాల మీ కూడా భారీగా కత్తెర వేస్తోంది. ఈసారి చాలా మంది విద్యార్థులకు వీసాలను తిరస్కరించింది. 

New Update
F1 Visa

F1 Visa

అమెరికాలో ఉన్నత విద్యకు బోలెడంత డిమాండ్ ఉంది. మన దేశం నుంచి దీని కోసం చాలా మంది వెళుతుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే వారి సంఖ్య ఎక్కువే ఉంటుంది.  అయితే కొంతకాలంగా విద్యార్థి వీసాల్లో బాగా కోత పడిపోతోంది.  కొత్తగా వచ్చే అప్లికేషన్లు చాలా మట్టుకు తిరస్కరణకు గురౌతున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణకు చెందినవే ఎక్కువ ఉంటున్నాయని హైదరాబాద్ కన్సెల్టెన్సీలు చెబుతున్నాయి. యూఎస్ యూనివర్శిటీల్లో అడ్మిషన్లు లభించినా..వీసాలు రావడం లేదని చెబుతున్నారు. 

ఏ చిన్న తప్పు ఉన్నా వదలడం లేదు..

అమెరికాలో ఆగస్టు- డిసెంబర్‌ సెమిస్టర్‌ సమయంలోనే మన విద్యార్థులు అధికంగా వెళ్తుంటారు. అయితే, గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 41 శాతం వీసా దరఖాస్తులను ఒప్పుకోలేదు. వాటికి కారణాలేంటనేది కూడా చెప్పడం లేదు. ఏ చిన్న పొపాటు ఉన్నా వదడలడం లేదు..అన్నీ పట్టి పట్టి చూస్తున్నారని చెబుతున్నారు. ఇంతకు ముందు ఇలా ఉండేది కాదని...ట్రంప్ వచ్చాకనే ఇదంతా జరుగుతోంది అంటున్నారు. విద్యార్థులకు ఇచ్చేది నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా ఎఫ్ 1. దీనితో అక్కడ సెటిల్ అవడం కూడా కుదరదు. అయినా కూడా వీసాలను అనుమతించడం లేదు. 

అమెరికా చెబుతున్న లెక్కల ప్రకారం 2023-24 లో ఎఫ్‌-1 వీసాల కోసం 6.79 లక్షల దరఖాస్తులు రాగా.. ఇందులో 2.79 లక్షల దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. అంతకుముందు 2022-23లో 6.99 లక్షల దరఖాస్తుల్లో 2.53 లక్షల అప్లికేషన్లను నిరాకరించారు. దీనికి ప్రధాన కారణం చదువు అయిపోయినా కూడా విద్యార్థులు అమెరికాలోనే ఉండిపోవడం అని చెబుతున్నారు. ఇక్కడ చదువు అవ్వగానే.. ఇక్కడే ఉద్యోగం సంపాదించుకోవాలని విద్యార్థులు అనుకుంటారు. చదువుకు, ఉద్యోగానికి మధ్య గ్యాప్ వచ్చినా కూడా ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతున్నారు. దీన్ని గమనించిన అమెరికా ప్రభుత్వం ఏకంగా వీసాలనే తిరస్కరిస్తోంది. మరోవైపు అమెరికాలో సీటు దొరకని స్టూడెంట్స్ అందరూ యూకే, జర్మనీలకు వెళ్ళిపోతున్నారు.

 today-latest-news-in-telugu | usa | student-visa 

Also Read: సుంకాల పేరుతో ప్రపంచంపై ట్రంప్ ట్రేడ్ వార్.. ఎవరికెంత నష్టం! 

 

Advertisment
Advertisment
Advertisment