T20 World Cup: కెనడాపై అతి కష్టం మీద గెలిచిన పాకిస్తాన్

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అతి ముఖ్యమైన మ్యాచ్‌లో పాకిస్తాన్ కెనడా మీద ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో తన సూపర్ 8 అవకాశాల మీద ఇంకా ఆశను నిలుపుకుంది పాక్.

New Update
T20 World Cup: కెనడాపై అతి కష్టం మీద గెలిచిన పాకిస్తాన్

Pak Vs Canda: మొత్తానికి పాకిస్తాన్ ఒక మ్యాచ్ గెలిచింది. అది కూడా చావో రేవో తప్పదు అన్న పరిస్థితుల్లో. గ్రూప్‌లో ఏలో పాకిస్తాన్ సూపర్ 8కు వెళ్ళాలంటే కెనడాతో ఈరోజు జరిగిన మ్యాచ్‌లో గెలవక తప్పని పరిస్థితి. ఈ మ్యాచ్‌లో కూడా పాక్ జట్టు అతి కష్టం మీద నెగ్గింది. ఇప్పటివరకు పాక్ మొత్తం మూడు మ్యాచ్‌లు ఆడింది. భారత్, అమెరికా ఏతుల్లో ఓడిపోయింది. ఇప్పుడు ఏడు వికెట్ల తేడాతో కెనడాను ఓడించింది. 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ 17.3 ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రిజ్వాన్‌ 53 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 53 పరుగులు చేయగా.. కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ 33బంతుల్లో బంతుల్లో ఒక ఫోర్‌, ఒక సిక్స్తో ౩౩ పరుగులు చేశాడు. అయూబ్‌ 6, ఫకార్‌ జమాన్‌ 4లతో వెనుదిరిగారు. ఇక కెనడా బౌలర్లలో డిలల్ఆన్ హేలిగర్ రెండు వికెట్లు...జెమీ గోర్డాన్ ఒక వికెట్ తీశారు.

ఇక అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కెనడా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. ఓపెనర్ ఆరోన్ జాన్సన్‌ 44 బంతుల్లో 52పరుగులు చేయగా.. కలీం సనా (13), సాద్ బిన్ జాఫర్ (10), డిల్లాన్ హేలిగర్ (9) పరుగులు చేశారు. నవనీత్ ధాలివాల్ (4), పర్గత్ సింగ్ (2), నికోలస్ కిర్టన్ (1), శ్రేయస్ మొవ్వ (2) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.పాక్‌ బౌలర్లలో హారిస్‌ రవూఫ్‌ 2, మహ్మద్‌ అమీర్‌ 2, షహీన్ అఫ్రిది, నసీమ్‌ షా తలో వికెట్ పడగొట్టారు.

Also Read:Andhra Pradesh: మరికాసేపట్లో అమిత్‌ షాతో చంద్రబాబు సమావేశం

Advertisment
Advertisment
తాజా కథనాలు