OPERATION AJAY:ఆపరేషన్ అజయ్-ఢిల్లీకి చేరుకున్న 235మంది భారతీయులు

ఇజ్రాయెల్, హమాస్ పోరులో ఇరుక్కున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తున్నారు. ఆపరేషన్ అజయ్ పేరుతో భారతీయులను ఇండియాకు తీసుకువస్తోంది గవర్నమెంట్. దీనిలో భాగంగా నిన్న 212 మంది వచ్చారు. ఈరోజు రెండో ఫ్లైట్‌లో 235 మంది స్వదేశానికి చేరుకున్నారు.

New Update
OPERATION AJAY:ఆపరేషన్ అజయ్-ఢిల్లీకి చేరుకున్న 235మంది భారతీయులు

ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య యుద్ధం 8వ రోజుకు చేరుకుంది. గాజా, ఇజ్రాయెల్ రెండింటిలోనూ హత్యాకాండ జరుగుతోంది. హమాస్ దాడి తర్వాత, ఇజ్రాయెల్ సైన్యం కూడా తగిన సమాధానం ఇస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం ఉగ్రవాదుల రహస్య స్థావరాలపై దాడి చేస్తోంది. ఇందులో భాగంగా ఉత్తర గాజాను వదిలి వెళ్ళిపోవాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్లో ఇరుక్కున భారతీయులను మన ప్రభుత్వం వెనక్కు తీసుకురావడం మొదలు పెట్టింది.భారత ప్రభుత్వం ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభించింది. శుక్రవారం ఉదయం 212 మంది భారతీయులతో ప్రత్యేక విమానం న్యూఢిల్లీకి చేరుకుంది. ఇప్పుడు శుక్రవారం రాత్రి మరొక ఫ్లైట్ టెల్ అవీవ్ నుండి ఈ ఉదయం ఢిల్లీకి చేరుకుంది. ఈ ప్రత్యేక విమానంలో ఇద్దరు చిన్నారులు సహా 235 మంది ఉన్నారని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ఇజ్రాయెల్‌లో దాదాపు 18 వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. అక్కడి నుంచి ఎవరైతే తమ దేశానికి తిరిగి రావాలనుకుంటున్నారో వారిని ప్రభుత్వం ఆపరేషన్ అజయ్ లో ఇంటికి చేరుస్తోంది.

అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రదాడి జరిగిన వెంటనే ఎయిర్ ఇండియా తన విమానాలను నిలిపివేసింది. కాగా ఇప్పుడు అక్కడ దాడులు ఎక్కువ అవుతున్న తరుణంలో భారతీయులు ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు భారత్ చర్యలు చేపట్టింది. దానికి కోసం ప్రత్యేక విమానాలను నడుపుతోంది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ నుండి తిరిగి వచ్చే వారు ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. వారు తిరిగి రావడానికి అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోంది. అంతకుముందు, టెల్ అవీవ్ నుండి ఆపరేషన్ అజయ్ కింద నడిచే ప్రత్యేక విమానంలో ఎక్కడానికి విద్యార్థులతో సహా భారతీయుల పొడవైన క్యూ విమానాశ్రయంలో కనిపించింది. భారత ప్రభుత్వం బుధవారం ఆపరేషన్ అజయ్ ను ప్రారంభించినట్లు ప్రకటించింది. దీనికి కోసం ప్రత్యేక చార్టర్ విమానాలు, ఇతర ఏర్పాట్లు చేసామని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. విదేశాల్లోని మా పౌరుల భద్రత శ్రేయస్సు కోసం మేము పూర్తిగా కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

Also Read:ఈసారి కూడా విజయం మనదేనా? 8-0తో రోహిత్ రికార్డ్ సృష్టిస్తాడా?

Advertisment
Advertisment
తాజా కథనాలు