USA : దేవుడే నన్ను రేసులో నుంచి పొమ్మని చెప్పాలి- జో బైడెన్

ప్రెసిడెంట్ డిబేట్‌లో తాను అస్వస్థతకు గురయ్యానని...చాలా అలిసిపోయానని అందుకే గెలవలేకపోయానని అన్నారు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్. దేవుడు మాత్రమే తనను అధ్యక్ష రేసులో నుంచి తప్పించగలడని చెప్పారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా నిలబడడానికి తానే ఉత్తమ అభ్యర్ధినని ఆయన అన్నారు.

New Update
Joe Biden: ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్న జో బైడెన్‌!

President Joe Biden : దేవుడు పై నుంచి వచ్చి జో నువ్వు రేసు నుంచి వెళ్లిపో అని అడిగితే తాను రేసు నుంచి వెళ్లిపోతానన్నారు అమెరికా (America) అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden). చర్చలో జరిగిన తప్పులను ఆయన అంగీకరించారు. తనకు అస్వస్థతగా ఉన్నందునే చర్చలో సరిగా స్పందించలేదన్నారు. జూన్‌ 27న ట్రంప్‌ తో జరిగిన డిబేట్‌లో బైడన్‌ తడబడటంతో అధ్యక్ష పదవి రేసు నుంచి వైదొలగాలని సొంత పార్టీ నేతలే డిమాండ్‌ చేస్తున్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. అవన్నీ తప్పుడు వార్తలని బైడెన్ కొట్టిపారేశారు. ట్రంప్‌ను గెలిపించకుండా ఉండేందుకు తాను తప్ప ఉత్తమ అభ్యర్ధి ఎవరూ లేరని బైడెన్ అన్నారు. దేవుడు మాత్రమే తనను అధ్యక్ష రేసులో నుంచి తప్పించగలడని ఆయన అన్నారు. ప్రపంచానికి ఆయనే నాయక్వం వహిస్తున్నారని చెప్పారు.

డిబేట్‌లో ట్రంప్ (Donald Trump) 28సార్లు అబద్ధం చెప్పారని జో బైడెన్ అంటున్నారు. విదేశీ నాయకులు, జాతీయ భద్రతా మండలి అధికారులతో చర్చించాలని ముందే చెప్పి ఉంటే తాను ముందే ప్రిపేర్ అయ్యేవాడినని ఆయన అన్నారు. అంతేకాదు తాను కేవలం ప్రచారం మాత్రమే చేయడం లేదని..ప్రపచాన్ని నడుపుతున్నాని...ఇది అిశయోక్తిలా అనిపించినా నిజమేనని చెప్పారు.

Also Read:National: గుజరాత్‌లోనూ బీజేపీని ఓడిస్తాం -రాహుల్‌ గాంధీ

Advertisment
Advertisment
తాజా కథనాలు